ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో మరొకరికి మార్గదర్శకులుగా ఉన్నత స్థాయికి ఎదగాలి…… మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో మరొకరికి మార్గదర్శకులుగా ఉన్నత స్థాయికి ఎదగాలి…… మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ప్రచురణార్థం

తొర్రూర్ /మహబూబాబాద్ – ఆగస్ట్ 19:

మంచిగా చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి మరొకరికి మార్గదర్శకులుగా నిలవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

శుక్రవారం ఉదయం స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తొర్రూర్ లోని స్నేహా నివాసంలో అనాథ బాలికలకు పండ్లు, స్వీట్లు, దుస్తులను పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా కలెక్టర్ కె శశాంక లు విచ్చేయగా పిల్లలు ముక్తకంఠంతో అతిధులకు స్వాగత గీతాన్నీ పాడి పుష్పగుచ్ఛాలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, దేశ గొప్పతనాన్ని ఆనాటి స్వాతంత్ర స్ఫూర్తిని, పోరాటాలను నెమరు వేసుకోవాలని, ఆనాటి స్వతంత్ర సమరయోధుల వల్లే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛకు నిదర్శనమని, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం15 రోజుల పాటు భారత వజ్రోత్సవ ద్వి సప్తహ వేడుకలను ప్రతి గడపలో, పల్లెల్లో, పట్టణాల్లో ఘనంగా నిర్వహిస్తున్నదని, ఎంతో మంది స్వాతంత్రం కోసం ప్రాణ త్యాగాలు, జైలుకు వెళ్లి శిక్ష లను అనుభవిస్తూ, వివిధ ఉద్యమాలతో శాంతియుతంగా పోరాడుతూ స్వాతంత్ర్యాన్ని సాధించారని, అట్టి చరిత్రలను ప్రతి పౌరులకు తెలియజేస్తూ భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని, బానిస విముక్తి కోసం అనేక పోరాటాలు చేశారని వారందరూ మనకు స్ఫూర్తిదాయక మని, వారి అడుగుజాడల్లో నడవాలని, ప్రత్యేక రాష్ట్రం కోసం ఏలాగైతే ప్రాణత్యాగాలు అర్పించి శాంతియుతంగా రాష్ట్రాన్ని సాధించుకున్నామో దేశ స్వాతంత్ర స్ఫూర్తి ప్రధానమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

మీరందరూ నా బిడ్డలని, అధైర్య పడకుండా చదువులో ముందు ఉంటూ రాణించి మరొకరికి మార్గదర్శకులుగా నిలవాలని, ధైర్య సాహసాలు పెంపొందించుకోవాలని తెలిపారు. 36 మంది అనాధ బాలికలకు పండ్లు, స్వీట్లు, దుస్తులు పంపిణీ చేసి బాగోగులు తెలుసుకొని స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో వారి అడుగుజాడల్లో నడవాలని, మీరందరూ గాంధీ సినిమా చూసి ఎంతో పోరాట పాఠాలు నేర్చుకొని ఉంటారని, అహింస సత్యమార్గoను అనుసరించాలని, ఉన్నత స్థాయికి వేదగాలని మంత్రి, వారిని దివించారు.

జిల్లా కలెక్టర్ కె శశాంక మాట్లాడుతూ, మన ఆలోచనలు గొప్పగా ఉండాలని, 2010 సంవత్సరం నుండి పేదవారి, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలను చేరదీసి, ఉచిత వసతులను, విద్యను కల్పిస్తూ స్నేహా నివాస్ నిర్వహించ బడుతుందని, 36 మంది విద్యార్థులు ఉన్నారని వారందరికీ మెరుగైన వసతులు కల్పిస్తూ విద్యను అందిస్తున్నారని, స్నేహా నివాస్ వారి సేవలు వెలకట్టలేనివని, ఇక్కడ చదివిన వారు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని కలెక్టర్ తెలిపారు.
దుస్తులు పంపిణీ చేసిన దాతలకు మంత్రి, కలెక్టర్లు అభినందనలు తెలియజేశారు.

విద్యార్థినిలు ఆంగ్లంలో వజ్రోత్సవ వేడుకల నుద్దేశించి, భారత స్వాతంత్ర్య ఆనాటి ఉద్యమ చరిత్రను మంత్రి వారితో చెప్పించగా వారు చెప్పిన ఉపన్యాసాలు ఎందరినో ఆకర్షితులను చేశాయి.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో రమాదేవి, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్,ఎంపీపీ చిన్న అంజయ్య, ఆర్డిఓ రమేష్ బాబు, సిడబ్ల్యూసీ చైర్ పర్సన్ నాగవాణి, మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, కమిషనర్ గుండె బాబు, పట్టణ అభివృద్ధి కమిటీ చైర్మన్ పొనుగోటి సోమేశ్వర రావు, సర్పంచ్ పుష్ప లీల ,ఎంపీటీసీ బత్తుల యాకయ్య తాసిల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీవో కుమార్ ప్రజా ప్రతినిధులు, అధికారులు, సూపర్వైజర్లు అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, స్నేహాన్నివాస్ సిస్టర్స్, నీలోఫర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post