ఉపకార వేతనాలకు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ లకు ఆన్ లైన్ ధరఖాస్తుల సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్

డిసెంబర్ 31 లోగా ఉపకార వేతనాలకు ధరఖాస్తులు ఆన్ లైన్లో నమోదు చేయాలి

అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్

000000
ప్రభుత్వ పాఠశాలలో ఫ్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ ల మంజూరుకు ప్రధానోపాధ్యాయులు అందరూ డిసెంబర్ 31 లోగా ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసి సంబంధిత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు ధరఖాస్తు ఫారాలు అందజేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో విద్యార్థిని విద్యార్థుల ఫ్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ ల ధరఖాస్తుల నమోదు పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ ల కోసం 6,240 మంది విద్యార్థుల అర్హత కలిగి ఉన్నారని, ఇంతవరకు 336 మంది విద్యార్థులు మాత్రమే ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ ల కోరకు ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవడం జరిగిందని తెలిపారు. మిగిలిన విద్యార్థుల ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ మంజూరుకు ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో డిసెంబర్ 31 లోగా ఆన్ లైన్ లో ధరఖాస్తు చేయించాలని సంబంధిత ధరఖాస్తు ఫారాలను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు అందజేయాలని ఆమె ఆదేశించారు. విద్యార్థుల కులము, ఆదాయ ధృవీకరణ పత్రములు లేనిచొ మూడు రోజుల్లోగా జారీ చేయాలని డిప్యూటీ తహశీల్దార్లను ఆమె ఆదేశించారు. ఉపకార వేతనాల ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ లో ఏమైన సమస్యలు ఉన్నచో వెంటనే హెల్ఫ్ డెస్క్ నెంబర్: 9676611730 కు కార్యాలయ పని వేళలో సంప్రదించాలని ఆమె సూచించారు.

ఈ సమావేశంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు నేతనియల్, జిల్లా విద్యాధికారి జనార్ధన్ రావు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, డిప్యూటి తహశీల్దార్లు, ఏ.ఎస్.డబ్ల్యూ.వో.లు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post