ఉపాది హామీ పథకం, పల్లె ప్రగతి పనులను సమీక్షించిన – అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

ఉపాది హామీ పథకం, పల్లె ప్రగతి పనులను సమీక్షించిన – అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

ఉపాధి హామీ పధకం క్రింద ప్రతి గ్రామా పంచాయితీలో కనీసం 30 మంది కూలీలకు పనులు కల్పించేలా చర్యలు తీసుకోవలసిందిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని ఆడిటోరియం లో ఉపాధి హామీ, పల్లె ప్రగతి పనులపై ఏం.పి డి.ఓ.లు, ఏం.పి .ఓ.లు, ఏ.పి .ఓ.లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఉపాధి హామీ పధకం క్రింద నీటి సంరక్షణ, మట్టి పనులు, వైకుంఠధామాలు, సేగ్రిగేషన్ షేడ్స్, మొక్కలు నాటడం వంటి 230 రకాల పనులు చేపట్టవచ్చని అన్నారు. రాబోయే మూడు మాసాలు చాలా కీలకమని కాబట్టి ప్రతి గ్రామంలో శ్రమ శక్తి సంఘాలతో సమావేశమై జాబ్ కార్డు కలిగిన ప్రతి కూలికి పనిదినాలు కల్పించేలా వర్క్ సైట్ లు గుర్తించాలని సూచించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా జిల్లాను ఓ.డి.ఎఫ్. ప్లస్ ప్లస్ గా తీర్చిదిద్దుటకు ప్రతి గ్రామంలో మ్యాజిక్ సోక్ పిట్స్, కమ్యూనిటీ సోక్ పిట్స్, డ్రై ప్లాట్ ఫార్మ్స్ నిర్మాణాలు వంటివి జరగాలని అన్నారు. చివరి దశలో ఉన్న వైకుంఠధామాలు, సేగ్రిగేషన్ షెడ్ల వంటి పనులను యుద్ధప్రాతిపదికన అక్టోబర్ నెలాఖరు నాటికి పూర్తి గావించడంతో పాటు చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. జలశక్తి అభియాన్ క్రింద చేపట్టిన పనులను పోర్టల్ లో అప్ లోడ్ చేయాలన్నారు. హరితహారం క్రింద జిల్లాలో వంద శాతం గుంతలు తీసి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచామని, ప్రతి మండలంలో 9 కిలో మీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్ చేయాలని, చనిపోయిన మొక్కల స్థానంలో తిరిగి మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి దుకాణం వద్ద ఒక మొక్క నాటేలా చూడాలన్నారు. బృహత్తర పల్లె ప్రకృతి వనం పనులు త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు మరో 4 మినీ బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రతి మండలంలో 4 నుండి 8 ఎకరాల స్థలాన్ని గుర్తించాలని అన్నారు. ప్రభుత్వ సంస్థల ప్రాంగణాలు, వైకుంఠ ధామాలలో బయో ఫెన్సింగ్ పూర్తి చేయాలన్నారు. గ్రామాలలో మురుగు కాలువల శుభ్రంతో పాటు నీరు నిలువ ఉండకుండా చూడాలని, మంచి నీటిని క్లోరినేషన్ చేయాలన్నారు. జిల్లాలో 1631 పారిశుధ్య కార్మికులకు భీమా సౌకర్యం కల్పించవలసి ఉండగా మిగిలిన 257 మంది కి త్వరలో బాండ్ ఇప్పించేలా చూడాలన్నారు. గ్రామా పంచాయతీలలో నిర్ణీత తేదీలోగా విద్యుత్ బిల్లులు చెల్లించాలని, మల్టి పర్పస్ వర్కర్లకు జీతాలు వచ్చేలా చూడాలని, ట్రాక్టర్ వాయుదాలు క్రమం తప్పకుండ చెల్లించాలని సూచించారు. గ్రామా కంఠం వివరాలలో ఆ గ్రామంలో ఉన్న ఇల్లు, ప్రభుత్వ సంస్టలు, రోడ్లు, మురుగు కాలువల కోసం వినియోగించిన భూమి వివరాలతో పాటు ఖాళీ ప్రదేశం ఎంతో ఉందొ వివరాలు వెంటనే అందించాలని సూచించారు. పన్ను వసూళ్లపై దృష్టి పెట్టాలన్నారు. బతుకమ్మ చీరల పంపిణీని అక్టోబర్ 2 తరువాత ప్రజాప్రతినిధులచే నియోజక వర్గంలో ప్రారంభించిన అనంతరం రేషన్ దుకాణాల ద్వారా 18 ఏళ్ళు పైబడిన మహిళలకు పంపిణి చేయుటకు చర్యలు తీసుకోవలసిందిగా ప్రతిమ సింగ్ సూచించారు. ఎస్సి కార్పొరేషన్ ద్వారా 219 యూనిట్లు నెలకొల్పుటకు 8 కోట్ల 54 లక్షల సబ్సిడీ వచ్చిందని అందుకనుగుణంగా ఏం.పి .డి.ఓ.లు ప్రతిపాదనలు పంపవలసినదిగా సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషద్ సి.ఈ.ఓ. శైలేష్, డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, డి.పి ఓ. తరుణ్ కుమార్, ఎస్సి కార్పొరేషన్ ఈ.డి. దేవయ్య, డి.ఎల్.పి .ఓ.లు , ఏం.పి .డి.ఓ.లు, ఏం.పి .ఓ.లు, ఏ.పి .ఓ.లు పాల్గొన్నారు.

Share This Post