ఉపాధితో కూడిన శిక్షణ కార్యక్రమాలకు దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలి — జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ప్రచురణార్థం

ఉపాధితో కూడిన శిక్షణ కార్యక్రమాలకు దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలి.

మహబూబాబాద్ ఆగస్టు 21.

ఈ నెల 31వ తేదీ లోపు ఉపాధితో కూడిన శిక్షణ కార్యక్రమాలకు అర్హులైన దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ మేరకు శనివారం జిల్లా మహిళా శిశు సంక్షేమం వికలాంగుల సంక్షేమం వయో వృద్ధుల సంక్షేమం శాఖ ద్వారా ప్రకటన జారీ చేస్తూ ఉపాధితో కూడిన శిక్షణ కార్యక్రమాలకు అర్హులైన దివ్యాంగులు ఈ నెల 31వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

సంబంధిత శిక్షణా కోర్సుల వివరాలను అర్హతలు తెలియజేస్తూ దరఖాస్తు ఫారం www.wdsc.telangana.gov.in లో లభిస్తాయన్నారు.

శిక్షణ సమయంలో భోజన వసతి సౌకర్యాలు ఉచితంగా సమకూరుస్తున్న ట్లు తెలియజేశారు.

పూర్తి చేసిన దరఖాస్తును wdscskilldevelopment@gmail.com కు పంపిస్తూ….,
సంచాలకులు, వికలాంగుల మరియు సీనియర్ సిటిజన్ సంక్షేమ శాఖ కార్యాలయం, వికలాంగుల సంక్షేమ భవనం, నల్గొండ ఎక్స్ రోడ్డు, మలక్ పేట్,
హైదరాబాద్-500036, (ఫోన్ నెం.040-24559048 వారికి పోస్ట్ ద్వారా పంపించాలన్నారు.

దివ్యాంగులు ఈ సదవకాశాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
————————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయడమైనది.

Share This Post