ఉపాధి’లో కూలీల సంఖ్యను పెంచాలి, నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని చేపట్టాలి – జిల్లా కలెక్టర్‌ పి. ఉదయ్ కుమార్

జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని కలెక్టర్‌ పి ఉదయ్ కుమార్ ఎంపీడీవోలు గ్రామీణ అభివృద్ధి అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్‌లో అన్ని మండలాల ఎంపీడీవోలు, ఏపీవోలతో ఉపాధి హామీ, నర్సరీల ఏర్పాటు పల్లె ప్రగతి పనులపై నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జాతీయ ఉపాధిహామీ పనుల్లో భాగంగా హరితహారం, నర్సరీలు, గ్రామాల్లో తదితర పనులు చేపట్టాలని సూచించారు.
సమయం వృథా చేయకుండా గ్రామాల్లో ఎంపిక చేసిన పనులు వేగవంతంగా పూర్తి చేయించాలన్నారు.
కూలీలకు సంబంధించిన వేతనాన్ని వారి ఖాతాల్లో జమ చేయాలని నిర్దేశించారు.
ఉపాధి హామీ పనుల్లో కూలీలు కరోనా నిబంధనలను పాటిస్తూ మాసులు ధరించి, భౌతికదూరం పాటిస్తూ పనులు నిర్వర్తించేలా గ్రామ కార్యదర్శులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాలని ఆదేశించారు.
ప్రతి జీపీలో 250 మంది కూలీలు పనిచేసేలా చూడాలని తెలిపారు. గ్రామీణ ఉపాధిహామీ పథకం ఎంతో ముఖ్యమైనదని, అన్ని గ్రామాల్లో ఎకువ మంది కూలీలకు కల్పించాలని తెలిపారు.
ప్రతి మండలంలోని గ్రామాల్లో ప్రతి రోజు 60 మంది లోపు కూలీలకు పనులు కల్పించాలని అన్నారు.
రానున్న హరితహారానికి మొక్కలను సిద్ధం చేసేలా గ్రామ స్థాయిలో నిర్వహిస్తున్న నర్సరీలో బ్యాగ్ ఫిల్లింగ్ పనులను పూర్తి చేయాలన్నారు.
నర్సరీల్లో మొక్కల పెంపకానికి పనులు చేపట్టని గ్రామ సర్పంచులు గ్రామ కార్యదర్శుల పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పల్లె ప్రగతి లో చేపట్టే కార్యక్రమాలపై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.
ప్రతి మండలానికి ఉపాధి హామీ కూలీల టార్గెట్లు విధించి లక్ష్యాన్ని పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
స్వచ్ఛభారత్ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మను చౌదరి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నర్సింగ్ రావు, జిల్లా పరిషత్‌ సీఈవో భాగ్యలక్ష్మి, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారిని రాజేశ్వరి, డిఆర్డిఓ ఏఓ నట్రాజ్, ఎంపీడీవోలు, ఏపీవోలు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post