ఉపాధి’లో కూలీల సంఖ్య పెంచండి – అదనపు కలెక్టర్ మను చౌదరి

ఉపాధి’లో కూలీల సంఖ్య పెంచండి – అదనపు కలెక్టర్ మను చౌదరి

జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని ఎంపీడీఓలు, ఎంపీఓలను అదనపు కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్‌లో అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలతో ఉపాధి హామీ, హరితహారం నర్సరీలపై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ…

జాతీయ ఉపాధిహామీ పనుల్లో భాగంగా హరితహారం, నర్సరీలు,  శ్మశానవాటికల నిర్మాణం తదితర పనులు చేపట్టాలని సూచించారు. సమయం వృథా చేయకుండా నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయించాలన్నారు.

కూలీలకు సంబంధించిన వేతనాన్ని వారి ఖాతాల్లో జమ చేయాలని నిర్దేశించారు.

వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసి, వారికి భరోసా కల్పించాలన్నారు. ప్రతి జీపీలో 30మంది కూలీలకు తగ్గకుండా పనిచేసేలా చూడాలనన్నారు.

గ్రామీణ ఉపాధిహామీ పథకం ఎంతో ముఖ్యమైనదని, అన్ని గ్రామాల్లో ఎకువ మంది కూలీలకు కల్పించాలని తెలిపారు.

హరితహారం క్రింద నాటిన మొక్కల కూలీల డబ్బును వెంటనే చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నర్సింగరావు, అదనపు డిఆర్డిఓ  లు,  డి ఎల్ పి వో లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post