ఉపాధిహామీ పనులు పారదర్శకతతో నిర్వహించాలి : జిల్లా అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి

జిల్లాలో రానున్న సంవత్సరంలో జరుగబోయే ఉపాధి హామీ పనులు పారదర్శకతతో ప్రణాళికబద్దంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్‌లో గల రైతు వేదికలో గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, సహాయ పంచాయతీ అధికారులు, ఈ.సి., టి.ఎ. లకు రెండు రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతులకు హాజరై మాట్లాడారు. (గామీణ ప్రాంత ప్రజల ఆర్థిక అభివృద్ధి కోసం ఉపాధి హామీ పనులు ఎంతగానో పనిచేస్తాయని, ఉపాధి హామీ పథకానికి సంబంధించి తొమ్మిది రకాల అంశాలపై పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని, చేసిన ప్రతి పనిని ప్రజలకు తెలిసేలా అధికారులు వ్యవహరించాలని తెలిపారు. రెండు రోజుల పాటు అందిస్తున్న శిక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, గ్రామస్థాయిలో పనులకు సంబంధించి గ్రామసభలో తప్పనిసరిగా తీర్మానం చేయాలని, జాబ్‌ కార్డు అప్‌డేషన్‌ ప్రక్రియ నిరంతరం సాగాలని, ఎప్పటికప్పుడు జరిగే మార్పులు దానిలో నమోదు చేయాలని, ప్రతి పనికి సంబంధించి బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రతి జాబ్‌ కార్డ్జు కు తప్పనిసరిగా వంద రోజులు పని కల్పించాలని తెలిపారు. ఉపాధిహామీ పనులు ప్రతి శ్రమశక్తి సంఘానికి కేటాయించిన వాటిని గుర్తించాలని, ఆ పనులను గ్రామపంచాయతీ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌లలో అప్రూవల్‌ చేయించవలసి ఉంటుందని, పని చేసేటప్పుడు తప్పనిసరిగా పని ప్రారంభానికి ముందు, మధ్యలో, పని పూర్తయిన తర్వాత మూడు ఫోటోలు తీయాలని, పని బడ్జెట్‌కు సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని, శిక్షణ కార్యక్రమంలో భాగంగా కెరిమెరి ఏ.పి.ఓ. నగేష్‌ ఉపాధి హామీ పనులకు సంబంధించి అనుసరించాల్సిన విధానాన్ని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ అందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ సురేందర్‌, అధికారి కుటుంబరావు, ఆంజనేయులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post