ఉపాధిహామీ పనుల్లో నిర్దేశిత లక్ష్యాన్ని సాధించాలి :: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

ఉపాధిహామీ పనుల్లో నిర్దేశిత లక్ష్యాన్ని సాధించాలి :: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

ప్రచురణార్థం-2

ఉపాధిహామీ పనుల్లో నిర్దేశిత లక్ష్యాన్ని సాధించాలి :: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 28: ఉపాధిహామీ పనుల్లో ప్రణాళికాబద్ధంగా నిర్దేశిత లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. గురువారం ప్రగతిభవన్ లోని సమావేశ మందిరంలో ఎంపిడివోలు, ఇంజనీరింగ్ అధికారులు, ఎంపీవోలు, ఏపీవో లతో ఉపాధిహామీ పనులు, ఇంజనీరింగ్ పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ పంచాయతీకి 150 కి తగ్గకుండా ఉపాధిహామీ కూలీల సమీకరణ చేయాలన్నారు. కూలీల సమీకరణ లో వెనుకంజలో ఉంటే చర్యలు తప్పవన్నారు. కూలీల వెజ్ రేట్ విషయంలో పురోగతి ఉండాలని, గరిష్ట వెజ్ 257 రూపాయలకు గాను సరాసరి రూపాయలు 200 కు పైగా ఉండేలా పనులు చేయించాలన్నారు. గ్రామాల్లోని దివ్యాoగులతో వారికి ఏ పని అనువుగా ఉంటుందో తెలుసుకొని ఆయా పనులను కేటాయించాలని ఆయన అన్నారు. జిల్లాలో 30 వేల 291 మంది ఎస్సిలు, 13 వేల 319 మంది ఎస్టీలు, 77 వేల 572 మంది ఇతరులు, మొత్తంగా లక్షా 21 వేల 182 జాబ్ కార్డ్స్ జారీచేసినట్లు, ఇందులో ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటికి 25 వేల 755 మందికి ఉపాధి కల్పించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికి ఈ ఆర్ధిక సంవత్సరంలో 31 వేల 299 మస్టర్లు జారీ చేశామన్నారు. ఇంకనూ జాబ్ కార్డ్స్ ఇవ్వని వారికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. చేపట్టిన పనికి ఎఫ్టివోలు వెంట వెంటనే జనరేట్ చేయాలన్నారు. జిల్లాలో 55 బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో స్థల పరిస్థితి ని బట్టి 4 లక్షల 85 వేల 101 మొక్కలు నాటే అంచనాలకు గాను 3 లక్షల 15 వేల 465 మొక్కలు నాటినట్లు, మిగతా లక్ష్యాన్ని వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని నర్సరీల్లో 29 లక్షల 74 వేల మొక్కల పెంపకానికి అంచనా వేయగా 30 లక్షల 19 వేల విత్తనాలతో బ్యాగ్స్ ఫిల్లింగ్ చేయగా 28 లక్షల 26 వేల 430 మొక్కలు మొలకెత్తినట్లు, వీటిని సంరక్షించాలని ఆయన అన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ క్రింద ఎన్ని మొక్కలు, ఏ రోజున నాటింది, ఎన్ని ట్రీ గార్డులు పెట్టింది, మొక్కలు ఎంత మేర పెరిగింది పూర్తి వివరాలు సమర్పించాలన్నారు. అన్ని పారామీటర్స్ లో స్పష్టమైన పురోగతి ఉండాలని, చేసిన పనులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ నమోదు చేయాలని ఆయన తెలిపారు. ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపడుతున్న పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇంకనూ ప్రారంభించని పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. పనుల పూర్తికి ఇది మంచి సమయమని, వర్షాకాలం వస్తే, పనులు చేపట్టలేమని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర టీఎస్, డిఆర్డీవో పురుషోత్తం, డిపివో లత, జెడ్పి సిఇఓ శోభారాణి, డెప్యూటీ సిఇఓ రఘువరన్, ఎంపిడివోలు, ఎంపీవోలు, ఏఇలు, ఎపివో లు తదితరులు పాల్గొన్నారు.
———————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, జయశంకర్ భూపాలపల్లి కార్యాలయంచే జారిచేయనైనది.

Share This Post