ఉపాధి అవకాశాల శిక్షణలను సద్వినియోగపరచుకోవాలి – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆగష్టు 07, 2021ఆదిలాబాదు:-

నిరుద్యోగ యువతకు ప్రభుత్వ పరంగా నిర్వహించే వివిధ శిక్షణలను సద్వినియోగపరచుకొని ఉపాధి అవకాశాలను పొందాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం రోజున యువజన శిక్షణ కేంద్రం లో శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్ లను కలెక్టర్ ప్రధానం చేశారు. తొలుత ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని నిరుద్యోగులు ప్రభుత్వం ద్వారా అందించే వివిధ శిక్షణ లలో  శిక్షణ పొంది ఉపాధి అవకాశాలు సంపాదించుకోవాలని, తద్వారా కుటుంబ పోషణకు సహకరించాలని అన్నారు. గత సంవత్సరం నవంబర్ 2 న 150 మంది అభ్యర్థులకు ఐదు రకాల ట్రేడ్ లలో శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించి అందించామని తెలిపారు. ప్రస్తుత తరుణంలో సాంకేతిక పరమైన అంశాలలో మహిళలు శిక్షణ పొందడం అభినందనీయమని అన్నారు. ఇదే తరహాలో ఉపాధి అవకాశాలతో రాణించాలని అభిప్రాయపడ్డారు. సాంకేతిక నైపుణ్యంతో వివిధ సంస్థలు, కంపెనీలలో ఉపాధి పొందేందుకు దోహద పడుతుందని, రానున్న కాలంలో జిల్లాలో నిరుద్యోగ యువతకు మరిన్ని ట్రేడ్ లలో శిక్షణ కార్యక్రమాలు ఇప్పించడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు. 140 మంది శిక్షణ పొందిన అభ్యర్థులు వారి ఫీడ్ బ్యాక్ ల మేరకు జిల్లాలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలోనే కాకుండా ఇతర ప్రాంతాలు, పట్టణాలలో ఉద్యోగ అవకాశాలు సంపాదించుకొని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. భవిష్యత్ లో మరింత నైపుణ్యాన్ని సంపాదించుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని అన్నారు. రోజు వారి అవసరమయ్యే కంప్యూటర్, మొబైల్, సీసీ టీవీ, రిఫ్రిజిరేటర్, మార్కెటింగ్, ఎలక్ట్రానిక్, తదితర అంశాలలో శిక్షణ పొందిన వారికీ సర్టిఫికెట్లను కలెక్టర్ అందజేశారు. అంతకు ముందు జిల్లా యువజన సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఇప్పటి వరకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలు ఉపాధి పొందిన అభ్యర్థులు, భవిష్యత్ లో చేపట్టే కార్యక్రమాలపై వివరించారు. జిల్లాలో శిక్షణ పొందిన యువతకు అదాన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్టాఫింగ్ సొల్యూషన్, సిటీ మేకర్స్, రక్స సెక్యూరిటీ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ విజయ బయో ఫెర్టిలైజర్స్ కంపెనీలలో ఉద్యోగాల కోసం జాబ్ మేళ ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయా కంపెనీల ప్రతినిధులు మాట్లాడుతూ, నైపుణ్యం గల అభ్యర్థులను ఎంపిక చేసి మార్కెట్ కు అనుగుణంగా వేతనాలు, అలవెన్స్ లు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్య శాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పద్మభూషణ్ రాజు, వివిధ కంపెనీల ప్రతినిధులు, శిక్షకులు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….  జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post