ఉపాధి కల్పనకు, ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు కృషి చేయాలి DCC/DLRC సమావేశంలో…. కలెక్టర్ నిఖిల

ఉపాధి కల్పన పెంపొందించుటకు, ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు.

ఈరోజు కలెక్టర్ కార్యాలయం
లోని కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన SC, ST, మైనారిటీ సంక్షేమ శాఖలు, పంట రుణాలపై డీసీసీ, డి ఎల్ ఆర్ సి సమీక్ష సమావేశంలో పాల్గొని గత సంవత్సరం తీసుకున్న నిర్ణయాలు, దానికి సంబందించిన పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

జిల్లాలో ఖరీఫ్ కాలములో పంట రుణాల క్రింద 97,492 అకౌంట్లకు గాను రూ. 1028 కోట్ల ఋణ లక్ష్యం కాగా, సెప్టెంబర్ మసాంతం వరకు 80,513 మంది రైతులకు రూ. 813 కోట్ల రుణాలు అందించడం జరిగిందని LDM రాంబాబు కలెక్టర్ కు తెలియజేసినారు. వ్యవసాయ కల పరిమితి రుణాల క్రింద జిల్లాలో 963 కోట్లు లక్ష్యానికి రూ. 364 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. సూక్ష్మా, చిన్న మరియు మధ్య తరగతి వార్తకులకు రూ. 836 కోట్లు లక్ష్యానికి గాను రూ. 358 కోట్లు మంజూరు చేయఫామ్ జరిగిందని బ్యాంకర్లు సమావేశంలో కలెక్టర్ కు తెలియజేసినారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు (SHG ) సభ్యులకు జిల్లాలో 52 శాంతం అలాగే వీధి వ్యాపారులకు 91 శాంతం రుణాలు అందించి రాష్ట్రంలో 6 వ స్థానంలో ఉన్నట్లు తెలిపారు.
ఈ సందర్బంగా SC, ST, మైనారిటీ శాఖల రుణాలపై కలెక్టర్ సమీక్షిస్తూ ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న రుణాలను ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి నవంబర్ మసాంతం వరకు పూర్తి చేయాలని సూచించారు. SBI బ్యాంకులో పెండింగ్ కేసులు ఎక్కువగా ఉన్నాయని ప్రతి ఒక్కరికి రుణాలు అందేలా చూడాలన్నారు. సమావేశానికి హాజరు కాని బ్యాంకర్లు తదుపరి సమావేశంలో హాజరయ్యేటట్లు చర్యలు చేపట్టాలని LDM ను ఆదేశించారు.
ఈ సందర్బంగా డిస్ట్రిక్ట్ అనువల్
ప్రీ -ప్లాన్ కు సంబందించిన ప్రోటెన్షియల్ లింకుడ్ క్రెడిట్ ప్లాన్ 2022-23 అను పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించినారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, LDM రాంబాబు,DRDO కృష్ణన్, జిల్లా వ్యవసాయం శాఖ అధికారి గోపాల్, ఉద్యాన వన శాఖ అధికారి చక్రపాణి, పూర్ణిమ LDO/RBI, శిరి శర్మ DDM/Nabard, బాలసుబ్రహ్మణ్యం ఆక్సిస్ బ్యాంకు హెడ్, సయ్యద్ యూసఫ్, RM/తెలంగాణ గ్రామీణ బ్యాంకు లతో పాటు సంబంధిత సంక్షేమ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post