ఉపాధి హామి కూలీల డేటా, బకాయిల చెల్లింపుల సమాచారాన్ని వెంటనే ఆధునీకరించాలి…. 

ప్రచురణార్ధం

ఉపాధి హామి కూలీల డేటా, బకాయిల చెల్లింపుల సమాచారాన్ని వెంటనే ఆధునీకరించాలి…. 

మహబూబాబాద్, 2021 డిసెంబర్ – 16:

ఉపాధి హామి కూలీల డేటా, బకాయిల చెల్లింపుల సమాచారాన్ని వెంటనే ఆధునీకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.  

గురువారం అదనపు కలెక్టర్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సన్యాసయ్య తో కలిసి తన చాంబర్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణకు హరితహారం, నర్సరీల నిర్వహణపై ఎంపిడిఓలు, మండల పంచాయితీ అధికారులు, సహాయ ప్రోగ్రాం అధికారులు, ఇంజనీరింగ్ కన్స ల్టెంట్ లతో సమీక్షించారు.  ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, కొద్ది రోజులలో MGNREGS సాఫ్ట్ వేర్ ప్రస్తుత దశ నుంచి జాతీయ స్థాయిలో ఎన్. ఐ. సి. వారి నిర్వహణలోనికి వెళుతున్నందున ఉపాధి హామి కూలీల డేటా, బకాయిల చెల్లింపుల సమాచారాన్ని వెంటనే ఆధునీకరించాలని ఆదేశించారు.  

టి. కె. హెచ్. హెచ్. కు సంబంధించి మొక్కల సంరక్షణ వంద శాతం స్థాయిలో చేపట్టాలని, ప్రభుత్వ ఆదేశాలనుసారం రాబోయే సంవత్సరానికి నర్సరీలు లక్ష్యానికి అనుగుణంగా వంద శాతం పూర్తి స్థాయిలో చేపట్టాలన్నారు.  ప్లాంటింగ్ పేమెంట్స్ అన్ని కూడా త్వరితగతిన చేయాలని, ఆలస్యమైన పక్షంలో వెంటనే సంజాయిషి కోరాలని డి.పి.ఓ ను ఆదేశించారు.  టి.ఎ. వారీగా గ్రామ పంచాయితీల వారీగా సమాచారం సేకరించాలని, రిపోర్ట్ లు సేకరించి చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలని, మరో 20 రోజులలో ప్రగతిని సాధించని పక్షంలో సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.  హోమ్ స్టెడ్ ప్లాంట్ల అవసరాన్ని బట్టి మొక్కల డిమాండ్ సర్వే గ్రామ పంచాయితీ వారీగా చేపట్టాలని డి.పి. ఒ. ను ఆదేశించారు.

మండలాలకు టేక్ స్టంప్స్ వచ్చినవి వెంటనే పాలథిన్ బ్యాగులలో నాటి సంరక్షించాలని డి.ఆర్. డి. ఓ., ఎం. పి. డి.ఓ లను ఆదేశించారు.   మొక్కలు నాటే కార్యక్రమం వచ్చే వారానికి 100 శాతం పూర్తి కావాలని, ప్రస్తుతం బృహత్ పి.పి.వి లు మండలానికి ఒకటి చొప్పున 16 పూర్తి అయినాయని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మండలానికి 4 చొప్పున మిగతా బృహత్ పి.పి.వి లకు గాను స్థల సేకరణ పూర్తి చేసి ప్రారంభించలని ఆదేశించరు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జె.డ్పి సి.ఇ. ఓ, డి.ఆర్. డి. ఓ., డి. పి. ఓ., ఆర్. డబ్ల్యు. ఎస్-ఇ ఇ, పంచాయితిరాజ్ – ఇ ఇ, తదితరులు పాల్గొన్నారు.
————————————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి, మహబూబాబాద్ కార్యాలయం చే జారీ చేయనైనది.

Share This Post