ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవు …. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

 

ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవు …. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ఉపాధి హామీ పథకం లో అవకతవకలకు పాల్పడితే సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు.

జిల్లాలో ఉపాధి హామీ పథకం నిర్వహణలో అవకతవకలకు పాల్పడిన సిబ్బందిపై చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

కంది మండలం లో 01, అక్టోబర్ 2018 నుండి 31 జూలై 2021 వరకు పనిచేసిన ఐదు మంది సిబ్బంది విధి నిర్వహణలో అవకతవకలకు పాల్పడినట్లు ప్రజాదర్బార్ లో రుజువయిందని ఆయన పేర్కొన్నారు.

కంది మండలంలోని మామిడిపల్లి లో ఉపాధి హామీ లో పనులు చేయకున్నా, ముస్టర్ రోల్ లో పేర్లు వ్రాసుకొని డబ్బులు డ్రా చేసుకున్న APO లింగమణి పర్యవేక్షణ లోపం, TA బన్సీలాల్ మేసర్మెంట్ బుక్ లో రికార్డ్ చేసారని, పంచాయతీ కార్యదర్శి సునీత మస్టర్ రోల్ పేమెంట్ కు ఇచ్చినట్లు సామాజిక తనిఖీలో వెల్లడైందన్నారు . కారకులపై తీవ్ర చర్యలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు.

అవకతవకలకు పాల్పడిన వారిలో ఏపిఓ కె.లింగమణి నీ అందోల్ మండలానికి బదిలీ చేసి, అవకతవకలకు పాల్పడిన డబ్బులు ఆమె వేతనం నుండి వసూలు చేయడంతో పాటు జరిమానా కూడా విధించామని తెలిపారు.

టెక్నికల్ అసిస్టెంట్ జె. బన్సీలాల్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ రద్దు చేసి, విధుల నుండి తొలగిస్తూ, అవకతవకలకు పాల్పడిన డబ్బులను సి.ఆర్.డి. ఖాతాలో జమ చేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.

టెక్నికల్ అసిస్టెంట్ ఎల్.అశోక్ కు ఇకముందు అవకతవకలకు పాల్పడ రాదని హెచ్చరిస్తూ, అవకతవకలకు పాల్పడిన డబ్బును అతని వేతనం నుండి వసూలు చేయడంతో పాటు జరిమానా విధించి, ఇతర మండలానికి బదిలీ చేయడానికి ఆదేశించామన్నారు.

టెక్నికల్ అసిస్టెంట్ టి. అశోక్ కు ఇకముందు అవకతవకలకు పాల్పడ రాదని హెచ్చరిస్తూ, అవకతవకలకు పాల్పడిన డబ్బును అతని వేతనం నుండి వసూలు చేయాల్సిందిగా ఆదేశించామన్నారు.

పంచాయతీ సెక్రెటరీ సునీత వేతనం నుండి అవకతవకలకు పాల్పడిన డబ్బు మొత్తాన్ని వసూలు చేయాలని, సీసీఏ నిబంధనల మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారికి ఆదేశించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

ఇకముందు ఎవరైనా ఉపాధి హామీ పథకం లో అవినీతి అక్రమాలకు పాల్పడినట్లయితే వేటు తప్పదని, కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.

Share This Post