నల్గొండ, సెప్టెంబర్ 21. ప్రతి గ్రామం లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపట్టి జాబ్ కార్డు కలిగిన కూలీలకు పనులు కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.మంగళవారం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కార్యాలయంలో డి.ఆర్.డి.ఓ. సహాయక పథక సంచాలకులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయత్ అధికారులు, అదనపు ప్రోగ్రాం అధికారులలతో సమీక్ష సమావేశం నిర్వహించి బృహత్ పల్లె ప్రకృతి వనాలు, పల్లె ప్రకృతి వనాలు, క్రిమిటోరియా, సేగ్రిగేషన్ షేడ్స్ మరియు యం.జి.యన్.ఆర్.ఇ.జి.యస్. పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ
ప్రతి గ్రామపంచాయితిలో 25 మందికి తక్కువ కాకుండా కూలీలు ఉపాధిహామీ పనికి హాజరయ్యేలా కూలీలకు అవగాహన కల్పించే విధంగా తగిన చర్యలు గైకోనాలని అందరు మండల పరిషత్ అభివృద్ధి అధికారులను ఆఫిషించారు
రోజువారి సగటు వేతనం పెరిగే విధంగా కూలీలకు పనుల కొలతలపై అవగాహన కల్పించాలని ఎం.పి.డి.ఓ.లను కోరారు.
వచ్చే సంవత్సరం హరితహారంలో నాటుటకు అవసరమైన మొక్కలు పెంచుటకు నర్సరీలలో బెడ్లు సిద్ధం చేసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారులను ఆదేశించారు.
జిల్లాలో పురోగతిలో ఉన్న అన్ని సేగ్రిగేషన్ షెడ్లు వారం లోపు పూర్తిచేయాలని, పురోగతిలో ఉన్న అన్ని యం.సి.సి. క్రిమిటోరియాలు సెప్టెంబర్ 25 లోపు పూర్తిచేయాలని ఎం.పి.డి.ఓ.లను ఆదేశించారు.
.స్వచ్చ భారత్ మిషన్ క్రింద ఖర్చు చేసిన డబ్బులకు యు.సి.లు వెంటనే సమర్పించాలన్నారు
జలశక్తి అభియాన్ పథకంలో భాగంగా సుమారు 24 వేల పనులు గుర్తించగా 21 వేల 768 పనులు పురోగతిలో ఉన్నాయని, 2 వేల 232 పనులు పూర్తి చేసినట్లు తెలిపారు పూర్తి చేసిన పనులన్నింటిని వెబ్ సైట్లో అప్లోడ్ చేసే విదంగా తగిన చర్యలు గైకోనాలని అన్నారు.
సి.యం. గిరి వికాసం పథకంలో మంజూరీ చేసిన యూనిట్లను సక్రమంగా వినియోగంలో ఉన్నాయా లేదా తనిఖీ చేయాలని ఎం.పి.డి.ఓ.లను ఆదేశించారు.
7 రిజిస్టర్ల అప్ డేషన్ వర్క్ ఫైల్ తయారుచేయుట, జాబ్ కార్డుల అప్ డేషన్ పూర్తిచేసే విధంగా తగిన చర్యలు గైకోనాలని ఆదేశించారు.
సస్పెండేడ్ , రిజేక్టేడ్ పేమెంట్స్ వెంట వెంటనే పూర్తి చేయుటకు తగిన చర్యలు గైకోనాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ అపూర్వ్ చౌహన్,డి.ఆర్.డి.ఓ.కాళిందిని,డి.పి.ఓ.విష్ణు వర్ధన్,జడ్.పి.సి.ఈ. ఓ.వీర బ్రహ్మ చారి తదితరులు పాల్గొన్నారు
ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పనులు కల్పించాలి:స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ*