ఉపాధి హామీ పనులలో కూలీల శాతం పెరిగేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.

మంగళవారం నాడు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఉపాధి  హామీ, పారిశుద్ధ్యం పనులపై  మండల అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మండల పంచాయతీ అధికారులు, ఉపాధి హామీ అధికారులతో సమీక్షిస్తూ,  ఉపాధి హామీ పనులలో కూలీల సంఖ్య పెరిగేలా క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ జాబ్ కార్డు అందించాలని తెలిపారు. గ్రామాలలో 85 శాతం పైగా మొక్కల సంరక్షణ ఉండాలని, మొక్కల సంరక్షణ సంబంధించి  ప్రతి నాలుగు వందల మొక్కలకు ఒక వాచర్ తప్పనిసరిగా ఉండాలని, ప్రతి గ్రామ పంచాయతీలో 10 నుండి 15 మంది వాచర్లతో మొక్కల సంరక్షణ చేపట్టాలని, నిర్ణీత సమయంలో వాటరింగ్  చేపట్టాలని తెలిపారు. నర్సరీలలో మొక్కల పెంపకానికి షెడ్యూల్ ప్రకారం అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డ్, సెగ్రిగేషన్ షెడ్స్ మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలని, వినియోగంలోనికి తేవాలని తెలిపారు. స్వచ్ఛ వారోత్సవ్ కార్యక్రమాలకు సంబంధించి గ్రామ సభలో తీర్మానం చేసుకున్న  పనులను పూర్తి చేయాలని, నిషేధిత ప్లాస్టిక్ వినియోగించకుండా క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకోవాలని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి,  జిల్లా పరిషత్ సీఈవో కృష్ణారెడ్డి,  జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం.ఉపేందర్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సునంద,  అడిషనల్ పిడి, డిఆర్డీఏ నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.

Share This Post