*ఉపాధి హామీ పనులు,నర్సరీ ల నిర్వహణ లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు:జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్*

  *ఉపాధి హామీ పనులు,నర్సరీ ల నిర్వహణ లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు:జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్*                             *# ప్రతి గ్రామం లో ఫాo పాండ్,ఫిష్ పాండ్ ఏర్పాటు పనులు ఉపాధి హామీ కింద చేపట్టాలి*          నల్గొండ, నవంబర్ 11. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి పనులు చేపట్టి కూలీలకు పనులు కల్పించడం లో,నర్సరీ ల నిర్వహణ లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను హెచ్చరించారు.గ్రామాల్లో కూలీలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సంబందిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి                 సహాయక పథక సంచాలకులు, మండల పరిషత్ అభివృద్ధి  అధికారులు, మండల పంచాయత్ అధికారులు, అదనపు ప్రోగ్రాం అధికారులు, ఏ.ఈ.(పీ.ఆర్.), పంచాయితీ కార్యదర్శులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించి వైకుంఠదామాల పురోగతి, నర్సరీల పురోగతి మరియు లేబర్ మొబిలైజేషన్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు, నర్సరీ ల నిర్వహణ పనుల ప్రగతి లో వెనుకబడిన మండలాల ఎం.పి.డి.ఓ.లు,ఏ.పి.ఓ.లు,ఎం.పి.ఓ.లకు సంబంధిత జిల్లా అధికారులు షోకాజ్ నోటీస్ లు జారీ చేయాలని అన్నారు.  అన్ని గ్రామపంచాయితీలో 30 మందికి తక్కువ కాకుండా కూలీలకు ఉపాధిహామీ పనులు కల్పించాలని అన్నారు.
 గ్రామపంచాయితీలలో  ఫాంపాండ్ కానీ లేదా  ఫిష్ పాండ్ పని కానీ ప్రారంభించి ఎక్కువ మంది కూలీలకు ఉపాధిహామీ పనులు కల్పించాలని  యం.పి.డి.ఓ.లు, యం.పి.ఓ.లు,ఏ.పి.ఓ.లను ఆదేశించారు.గత సంవత్సరం ఇదే సమయానికి  పోలిస్తే ఈ సంవత్సరం ఉపాధి కూలీలకు పనులు కల్పించడం లో చాలా మండలాలు వెనుక బడ్డాయని, వచ్చే వారం లోగా పనులు చేపట్టి కూలీల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
 గ్రామపంచాయితీ నర్సరీలలో పాలీథీన్ సంచులలో మట్టి నింపుట,సీడ్ కొనుగోలు మరియు సీడ్ డిబ్లింగ్,ప్రైమరీ బెడ్లు ఏర్పాటు చేయుట నవంబర్ 25 లోపల పూర్తిచేయాలని  ఆదేశించారు.బ్యాగ్ ఫిల్లింగ్ లో అనేక మండలాలు ఇంకా వెనుక బడి ఉన్నాయని అన్నారు.వచ్చే వానాకాలం సీజన్ వరకు నర్సరీ ల నిర్వహణ ముఖ్య విషయంగా చేపట్టాలని ఉపాధి కూలీల కు పనులు కల్పించడం లో మార్చి వరకు లక్ష్యం పూర్తి చేయాలని అన్నారు..
 జిల్లాలో పురోగతిలో మిగిలి ఉన్న అన్ని వైకుంఠదామాలను నవంబర్ 20 లోపల పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్   యం.పి.డి.ఓ.లు, యం.పి.ఓ.లు, ఏ.ఈ.(పీ.ఆర్.లు) లను ఆదేశించారు. జిల్లాలో పురోగతిలో మిగిలి ఉన్న అన్ని సేగ్రిగేషన్ షెడ్లు నవంబర్ 20 లోపల  పూర్తిచేయాలని  అన్నారు.జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అసిస్టెంట్. పి.డి.లు వారం లో నాలుగు రోజులు క్షేత్ర స్థాయి లో పర్యటించాలని,టూర్ షెడ్యూల్ పంపాలని కలెక్టర్ ఆదేశించారు. ఎం.పి.డి. ఓ.లు,ఎం.పి.ఓ.లు,ఏ.పి.ఓ.లు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని,పనులు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో  అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) రాహుల్ శర్మ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని, జిల్లా పంచాయత్ అధికారి విష్ణువర్ధన్,జడ్.పి.సి.ఈ. ఓ.వీర బ్రహ్మ చారి, ఈ.ఈ.(పీ.ఆర్.) లు తిరుపతయ్య, మాధవి లు తదితరులు పాల్గొన్నారు
*ఉపాధి హామీ పనులు,నర్సరీ ల నిర్వహణ లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు:జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్* *# ప్రతి గ్రామం లో ఫాo పాండ్,ఫిష్ పాండ్ ఏర్పాటు పనులు ఉపాధి హామీ కింద చేపట్టాలి*

Share This Post