ఉపాధి హామీ పనులు ఎక్కువగా కల్పించాలి – గ్రామీణ అభివృద్ధి సంస్థ పిడి నర్సింగ్ రావు

ఉపాధి హామీ పనులు ఎక్కువగా కల్పించాలి – గ్రామీణ అభివృద్ధి సంస్థ పిడి నర్సింగ్ రావు

గ్రామీణ ప్రాంతాలల్లో జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి పనులు కల్పించాలని పిడి డిఆర్డిఎ నర్సింగ్ రావు సంబంధిత ఏ పీ ఎం లు, శ్రీనిధి అధికారులను ఆదేశించారు.

బుధవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ప్రజావాణి సమావేశ మందిరంలో గ్రామీణ అభివృద్ధి శాఖలకు సంబంధించిన ఉపాధి హామీ నిర్వహణ తదితర పనులపై ఆయన సమీక్షించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి పనులలో ప్రతి జి. పి. నందు 50 మందికి పనులు కల్పించాలని సూచించారు.

ప్రతి జాబ్ కార్డు కలిగిన వ్యక్తికి రోజుకు 245 రూపాయలు కూలి వచ్చేలా పనులు కల్పించాలన్నారు.

శ్రీనిధి సిబ్బంది ఏ పీ ఎం లు సమన్వయంతో పనిచేసి 100 శాతం ఉపాధి హామీ పనులు కల్పించాలని ఆదేశించారు.

మహిళా సంఘాలు ఉపాధి హామీ పనులకు సహాయ సహకారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

బ్యాంకు లింకేజీ లను వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు

Share This Post