ఉపాధి హామీ పనులు ఎక్కువగా కల్పించాలి. వచ్చే హరిత హారనికి అన్ని నర్సరీలలో మొక్కలు పెంచాలి. ఇంటి పన్ను వసూళ్ళలో ముoదుండాలి.::: జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.

గ్రామీణ ప్రాంతాలల్లో జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.  మంగళవారం జెడ్.పి. కార్యాలయంలో సూర్యాపేట , పెనపహాడ్ మండలముల లో పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖలకు సంబంధించిన ఉపాధి హామీ, హరిత హారం,నర్సరీలు నిర్వహణ తదితర పనులపై అదనపు కలెక్టర్  పాటిల్ హేమంత్ కేసుగావ్ తో కలసి పాల్గొని  సమీక్షించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి పనులలో ప్రతి జి.పి. నందు 50 మందికి పనులు కల్పించాలని  సూచించారు. వచ్చే హరితహరనికి అన్ని నర్సరీలలో మొక్కలను పెంచాలని ప్రతి నర్సరీకి పశువుల నుండి మొక్కలను కాపాడేందుకు  ప్రహరీలు ఏర్పాటు చేయాలని అలాగే మొక్కల సంరక్షణకు అన్ని జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు.  అలాగే ప్రతి జి.పి.లో ఇంకుడు గుంటలు చేపట్టాలని ముఖ్యానంగా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాలో అటవీ శాతం తక్కువగా ఉన్నందున హరిత హారం కార్యక్రమాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని సూచించారు.జిల్లాలో ఇంటి పన్నుల వసూలు పెండింగులో ఉంచొద్దని , జి.పి లలో పెండింగ్ లో ఉన్న స్మశాన వాటికలను సత్వరమే పూర్తి చేయాలని సూచించారు. అలాగే సెగ్రీ గేషన్ షేడ్స్ లలో చెత్త ద్వారా వానపాముల పెంపకం ,  ఎరువుల తయారీ నిరంతరం కొనసాగాలని తెలిపారు.
ఈ సమావేశంలో  ZP CEO జి.సురేష్  , DRDO కిరణ్ కుమార్,ఇంచార్జి ,APD రాజు,DlPO లక్ష్మీ నారాయణ, జి.పి. కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post