ఉపాధ్యాయులందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి…

ప్రచురణార్థం

ఉపాధ్యాయులందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి…

మహబూబాబాద్ సెప్టెంబర్ 9.

ఉపాధ్యాయులు అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందేనని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

బుధవారం రాత్రి కలెక్టర్ కార్యాలయంలో వైద్య అధికారులతోనూ విద్యాసంస్థల అధికారులతో కోవిద్ 19 వ్యాక్సినేషన్ కార్యక్రమంపై కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 1209 పాఠశాలలో 898 స్కూల్స్ 100% వ్యాక్సినేషన్ జరిగిందన్నారు.
ప్రతి పాఠశాలలోనూ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 20 మందికి పైగా ఉంటే వైద్య బృందం ఆయా సంస్థలకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకొని వారికి తప్పనిసరిగా వ్యాక్సిన్ ఇవ్వాలని ఆదేశించారు.

ప్రతి ఉపాధ్యాయులు వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలియజేశారు వ్యాక్సిన్ తీసుకోవటంలో అనుమానాలు ఉంటే వైద్య అధికారుల వద్ద నివృత్తి చేసుకోవాలన్నారు జిల్లాలోని ఐదు డిగ్రీ కళాశాలలో ఉండగా అందులో 10 18 విద్యార్థులు ఉన్నారని తెలిపారు అందులో 584 మంది మొదటి విడత వ్యాక్సిన్ తీసుకున్నారన్నారు అదేవిధంగా 58 ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి అన్నారు ప్రభుత్వ కళాశాలలో 10 ఉండగా ప్రైవేట్ కళాశాలలు 21 ఉన్నాయని ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో 27 కళాశాలలు ఉన్నాయన్నారు 365 మంది ఉపాధ్యాయులు, ఉపాధ్యాయలు కానీ ఇతర సిబ్బంది తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ అన్నారు.
రెండు రోజుల్లోగా విద్యా సంస్థల సిబ్బంది వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా నివేదిక సమర్పించాల్సి ఉంటుందని బాధ్యతారాహిత్యంగా ఉండరాదని వ్యాక్సిన్ తీసుకొని వారు బాధ్యులుగా పరిగణిస్తామని తదుపరి చర్యలకు బాధ్యులు అవుతారు అని హెచ్చరించారు ఈ సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు విద్యా సంస్థల అధికారులు తదితరులు పాల్గొన్నారు
—————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post