ఉపాధ్యాయులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత-జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్.

సెప్టెంబర్ 05, 2021ఆదిలాబాదు:-

ఉపాధ్యాయులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరం లో ఆదివారం రోజున ఏర్పాటు చేసిన కార్యక్రమం లో జిల్లా పరిషత్ చైర్మన్ తో పాటు జిల్లా పరిషత్ సిక్తా పట్నాయక్, ఆదిలాబాద్ శాసన సభ్యులు జోగు రామన్న ముఖ్య అధితులుగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ, నవసమాజ నిర్మాణం కోసం విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం లో పాటు పడుతున్న ఉపాధ్యాయులు ముఖ్య పాత్ర వహిస్తున్నారని అన్నారు. అందుకోసం ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపికచేసి అవార్డులను అందించడం జరుగుతుందని, దీనితో వారిపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. ఈ నూతనోత్సహంతో మరింత నాణ్యమైన బోధనా అందించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ, కరోనా కారణంగా దాదాపు 16 నెలల తరువాత పాఠశాలలను పండుగ వాతావరణంలో ప్రారంభించుకున్నామని అన్నారు. విద్యా ప్రమాణాలు పెంపొందించేలా  భోదన చేపట్టాలని అన్నారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులను సన్మానించుకోవడం సంతోషకరమని అన్నారు. ఆదిలాబాద్ శాసన సభ్యులు జోగు రామన్న మాట్లాడుతూ, కరోనా సమయంలో విద్యార్థులు విద్యకు దూరం కావద్దని ఉద్దేశంతో ఆన్లైన్ తరగతులు నిర్వహించడం జరిగిందని అన్నారు. మాజీ రాష్ట్రపతి సర్వ్ పల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిలో చేసిన సేవల ఆధారంగా ఆయన పుట్టిన రోజున ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపిక చేసిన 60 మంది ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించి మెమొంటో, ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా విద్యా శాఖ అధికారి రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్, గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post