ఉపాధ్యాయులు సమష్టి కృషితో మరింత ముందుకు వెళ్లాలి – అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి

2022 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం క్యాంపు కార్యాలయంలో రాష్ట్రోపాధ్యాయ సంఘం డైరీ, క్యాలెండర్‌ను నాగర్ కర్నూలు జిల్లా అదనపు కలెక్టర్ పీ. శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హక్కులు, బాధ్యతలు రెండు నేత్రాలుగా ఉపాధ్యాయులు సమిష్టి కృషితో మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం పర్వతరెడ్డి, జిల్లా కార్యదర్శి మురళి, రాష్ట్ర కార్యదర్శి కె రమేష్ , రాష్ట్ర నాయకులు వారాల సత్యనారాయణ మరియు జిల్లా నాయకులు అనిల్ కుమార్ రెడ్డి మల్లయ్య నరసింహ కరుణాకర్ రెడ్డి నాగర్ కర్నూలు మండల ప్రధాన కార్యదర్శి కే సురేష్ బాబు బిజినాపల్లి మండల అధ్యక్షులు పి బాలస్వామి వెంకట స్వామి పెద్ద కొత్తపల్లి మండలం అధ్యక్షులు మద్దిలేటి, తెలకపల్లి మండల అధ్యక్షులు విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

Share This Post