ఉపాధ్యాయుల అంతర్ జిల్లాల స్పౌజ్‌ కేటగిరీ కేటాయింపుల అనంతరం కౌన్సెలింగ్‌ ప్రక్రియను ఉపాధ్యాయ సంఘాల సమక్షంలో ప్రారంభించిన – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

ఉపాధ్యాయుల అంతర్ జిల్లాల స్పౌజ్‌ కేటగిరీ కేటాయింపుల అనంతరం  కౌన్సెలింగ్‌ ప్రక్రియను ఉపాధ్యాయ సంఘాల సమక్షంలో ప్రారంభించిన – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

లోకల్‌ కేడర్‌లో ఉపాధ్యాయులకు పోస్టుల కేటాయింపు ప్రక్రియలో భాగంగా భాగస్వామి (స్పౌజ్‌) కేటరిగిలో నాగర్ కర్నూలు జిల్లాకు కొత్తగా 81 మంది ఉపాధ్యాయుల కేటాయించడంతో ఇదివరకే జిల్లాకు కేటాయించిన ఉపాధ్యాయులతో కలిపి మొత్తం 921 మంది ఉపాధ్యాయులకు 39 క్యాడర్ల వారీగా గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల సమక్షంలో కౌన్సెలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కౌన్సిలింగ్ లో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఇన్ఛార్జి డీఈవో రాజశేఖర్ రావు, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసులు, మండల విద్యాధికారులు రామారావు, శంకర్ నాయక్, బాసు నాయక్, శ్రీనివాసులు, చంద్రశేఖర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి సెక్టోరల్ అధికారులు సతీష్ కుమార్, బరపటి వెంకటయ్య, సూర్య చైతన్య, స్ట్రాంగ్ టీచర్ వెంకటేశ్వర శెట్టి, సైన్స్ అధికారి కృష్ణా రెడ్డి, ప్రసాద్ గౌడ్ రవి యాదవ్, ఉపాధ్యాయ సంఘల బాధ్యులు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .

Share This Post