ఉపాధ్యాయుల బదిలీలు , పదోన్నతులు పారదర్శకంగా జరగాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి జిల్లా కలెక్టర్లను కోరారు.

శుక్రవారం రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ,విద్యా శాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన,రాష్ట్ర విద్యా మౌలిక వసతుల సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి  తో కలిసి ఆమె జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు , పదోన్నతులు  ఇచ్చిన సమయం లో పూర్తి చేసి సీనియారిటీ, వేకెన్సిస్ యొక్క జాబితా నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాలని ,   మెడికల్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎక్కడ కూడా వేకన్సీస్ లేకుండా చూడాలని ఆమె అన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమం జిల్లాలో త్వరలో ప్రారంభం చేసుకునేందుకు అన్ని చర్యలు చేపడుతునందు న  మోడల్ స్కూల్ లలో అన్ని పెయింటింగ్  పనులు పూర్తి  చేసేలా చూడాలని ఆమె అన్నారు.
జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన మోడల్ పాఠశాలల్లో సంపూర్ణంగా పనులు పూర్తి చేసి జనవరి 30 నాటికి 32 పాఠశాలలు ప్రారంభం కు సిద్దంగా ఉన్నట్లు,
 మండలం కు రెండు చొప్పున ఎంపిక చేసినా మిగతా పాఠశాలల్లో కూడా అన్ని పనులు పిబ్రవరి 10 వ తేది నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు.ఉపాధ్యాయుల పదోన్నతులు,బదిలీలు సంబంధించి ఖాళీల జాబితా, సీనియర్టీ జాబితా వెబ్ సైట్ లో పొందు పరిచినట్లు తెలిపారు. ఈ వీడియో వి కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా,డి.ఈ. ఓ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు

ఉపాధ్యాయుల బదిలీలు , పదోన్నతులు పారదర్శకంగా జరగాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి జిల్లా కలెక్టర్లను కోరారు.

Share This Post