ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కు నమోదు చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కు నమోదు చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

నాగర్ కర్నూల్ జిల్లాలోని అర్హులైన ఉపాధ్యాయులు త్వరలో జరిగే మహబూబ్ నగర్ హైదరాబాద్ రంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో  కోరారు.

1-11-2016 నుండి 31-10-2022 సంవత్సరాల మధ్యలో 3 సంవత్సరాల పాటు అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలలు మరియు కళాశాలల్లో  బోధన సిబ్బందిగా పని చేసిన ఉపాధ్యాయులు మాత్రమే ఎమ్మెల్సీ ఓటర్ నమోదుకు అర్హులన్నారు.

నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో ఉన్న ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్లో రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, వ్యవసాయ విశ్వవిద్యాలయ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు, మెడికల్ కళాశాలలు మరియు పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న లెక్చరర్లు, తప్పని సరిగా తగు పత్రాలు సమర్పించి ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పాత ఓటర్ లిస్టు రద్దు కావడంతో అంతా నూతనంగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో దాదాపుగా 5,000 మంది పైగా ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకునేందుకు అర్హులుగా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.

ఎమ్మెల్సీ ఓటు నమోదుకు 19 దరఖాస్తు ఫారమ్ ను పూర్తి చేసి, సంబంధిత

తహసీల్దార్ కార్యాలయంలో, ఆర్డీవో కార్యాలయంలో లేదా ఆన్ లైన్ ద్వారా ఓటు నమోదు చేసుకోవచ్చునన్నారు.

నవంబర్ 7వ తేదీ ఓటు నమోదుకు చివరి తేదీ అని,

జిల్లాలో ఇప్పటివరకు ఓటు నమోదు కార్యక్రమంలో అత్యల్పంగా నమోదు అయినందున మంగళవారం ఈనెల 18వ తేదీ మధ్యాహ్నం 2:00 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ తెలిపారు.

సమావేశానికి అని సంఘాల నాయకులు హాజరుకావాలని కలెక్టర్ సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో కోరారు.

Share This Post