ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్భందీగా నిర్వహించేందుకు చర్యలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్

పత్రిక ప్రకటన

తేదీ : 11–11–2022

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్భందీగా నిర్వహించేందుకు చర్యలురాష్ట్ర  ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో పకడ్భందీగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు.శుక్రవారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని కీసర ఆర్డీవో కార్యాలయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా నమోదు ప్రక్రియ విచారణ జరుగుతున్న తీరుతో పాటు ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయనే వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అడిగి తెలుసుకొన్నారు.  మొట్టమొదటిసారిగా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాకు వచ్చిన ఆయనకు జిల్లా కలెక్టర్ హరీశ్, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు ప్రస్తుతం ఓటరు జాబితా నమోదు ప్రక్రియకు సంబంధించి జరుగుతున్న తీరును ఆయన పరిశీలించి ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయనే వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొన్నారు.  01-10-2022 ,వ తేదీన పబ్లికేషన్లు వచ్చాయని ఓటర్లుగా నమోదుకుఈనెల 7వ తేదీ చివరి గడువుగా ఉండగా కీసర రెవెన్యూ డివిజన్లో మొత్తం 2,814 మంది ఓటర్లుగా నమోదు చేసుకోగా అందులో 2,441 మంది డైరెక్టుగా, 373 మంది ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకొన్నారని వికాస్‌రాజ్ వివరించారు.  దీంతో పాటు ఈనెల 19న విచారణ డ్రాఫ్టులు, 23 తేదీ వరకు ఓటర్ల తుదిజాబితా విడుదల చేస్తామని అనంతరం డిసెంబర్ 9వ తేదీన ఓటర్ల జాబితాలో ఏమైనా అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు ఉంటే క్లయిమ్ చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం డిసెంబరు 25న ఓటర్ల జాబితాను డిస్పోజల్ చేయడంతో పాటు డిసెంబరు 30వ తేదీన చివరి జాబితాను విడుదల చేయడం జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ పేర్కొన్నారు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మూడు ఉమ్మడి జిల్లాలకు మొత్తం 19 మంది రెవెన్యూ డివిజన్ అధికారులు (ఆర్డీవో)లను ఏఈఆర్వోలుగా నియమించడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు వారు చేపట్టాల్సిన విధులు, బాధ్యతలను అప్పగించామని వికాస్‌రాజ్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ఉపాధ్యాయులు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ కోరారు. ఈ సమావేశంలో ఎన్నికల జాయింట్ సీఈవో రవికిరణ్ ,మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్,  జిల్లా విద్యాధికారిణి విజయలక్ష్మీ, ఆర్డీవో రవి, ఘట్కేసర్, కీసర తహశీల్దార్లు విజయలక్ష్మీ, గౌరీవత్సల తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు అధికారుల పనితీరుపట్ల వికాస్‌రాజ్ సంతృప్తి వ్యక్తం చేశారు.  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మొట్టమొదటిసారిగా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాను సందర్శించడం గమనించదగిన విషయం.

Share This Post