ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నియమించబడిన ప్రిసైడింగ్ సహాయ ప్రిసైడింగ్ అధికారులు ఏలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి.రవినాయక్ ఆదేశించారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నియమించబడిన ప్రిసైడింగ్ సహాయ ప్రిసైడింగ్ అధికారులు ఏలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి.రవినాయక్ ఆదేశించారు.

మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ఉద్దేశించి సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

గతంలో ఎన్నికలు నిర్వహించిన అనుభవం ఉన్నప్పటికీ ఎన్నికలకు నియమించబడిన పిఓ,ఏపిఓ లు ప్రతి ఎన్నికను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని, ఇందుకుగాను ఎన్నికల కమిషన్ నుంచి ఎప్పటికప్పుడు వచ్చే ఆదేశాలను క్షుణ్ణంగా ప్రతి వాక్యం వదలకుండా చదవాలని ఆదేశించారు.ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారుల పై ఎక్కువగా బాధ్యత ఉన్నప్పటికీ, సహాయ ప్రిసైడింగ్ అధికారి సైతం అన్ని అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఏదైనా కారణం చేత ప్రిసైడింగ్ అధికారి ఎన్నికలు నిర్వహించలేనప్పుడు సహాయ ప్రిసైడింగ్ అధికారి కూడా ఎన్నికలు నిర్వహించే విధంగా సంసిద్ధంగా ఉండాలన్నారు . రెగ్యులర్ ఎన్నికల మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా నిర్వహించాలని, ముందుగా ఎన్నికల సందర్భంగా చేయవలసినవి, చేయకూడని అంశాలను బాగా తెలుసుకోవాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు గాను ఆయా పోలింగ్ కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులన్నీ కల్పించడం జరిగిందని తెలిపారు. ఏదైనా అంశం తెలియనట్లైనా,సందిగ్ధం ఉన్నట్లయితే ఎలాంటి సంకోచం లేకుండా ముందుగానే అలాంటి విషయాలను అడిగి తెలుసుకోవాలని, ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. మళ్ళీ పిఓ,ఏపీవో లకు 6 వ తేదీన శిక్షణ ఇవ్వటం జరుగుతుందని, ఈ శిక్షణ సందర్భంగా పరీక్షను కూడా నిర్వహించాలని నిర్వాహకులకు ఆదేశించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఏఆర్ఓ రెవిన్యూ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కె. సీతారామారావు,ఎం ఎల్ సి ఎన్నికల బ్యాలెట్ బాక్సుల నోడల్ అధికారి డిపిఓ వెంకటేశ్వర్లు, ట్రైనింగ్ నోడల్ ఆఫీసర్ డిప్యూటీ సీఈఓ మొగులప్ప, మాస్టర్ ట్రైనర్లు అడ్డాకుల తహసిల్దార్ కిషన్, భూత్పూర్ ఎంపీడీవో మున్నీ తదితరులు హాజరయ్యారు.

 

Share This Post