ఉప్పల్వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిల్లాలో ఉత్తమ హరిత పాఠశాల గా మారిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ఎ. శరత్ అన్నారు

ప్రెస్ రిలీజ్. తేది10.08.2021

ఉప్పల్వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిల్లాలో ఉత్తమ హరిత పాఠశాల గా మారిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ఎ. శరత్ అన్నారు. మంగళవారం ఆయన ఉప్పల్వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలకు భూమిని వితరణ చేసిన పర్వ రెడ్డి ని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయుడు గోవర్ధన్ రెడ్డి చొరవతో ఆదర్శ హరిత పాఠశాల గా రూపుదిద్దుకుందని కొనియాడారు. జిల్లాలోని ఇతర పాఠశాలల్లో పచ్చదనం పెంపొందించడానికి కృషి చేస్తానని చెప్పారు. సైన్స్, గణితం, కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. పాఠశాలలో దాతల సహకారంతో మౌలిక వసతులు కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.గత ఆరేళ్లుగా పదవ తరగతిలో 100% ఫలితాలను సాధిస్తుందని పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి రెండు లక్షల రూపాయలు, గ్రామపంచాయతీలో ప్రగతి పనులు చేపట్టడానికి మూడు లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఉప్పల్వాయి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలు పనిచేస్తున్నాయని చెప్పడానికి ఉప్పల్వాయి ఉన్నత పాఠశాల ఉదాహరణ గా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈవో రాజు, సర్పంచ్ గంగారం, ఎంపీటీసీ సభ్యురాలు ఉమాదేవి, సహకార సంఘం డైరెక్టర్ నారాయణ రెడ్డి, ఎస్ఎంసి ప్రతినిధులు పాల్గొన్నారు. Dpro..Kamareddy

Share This Post