ఉప కరణాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

మంగళవారం కలెక్టరేట్లో మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా రిట్రోఫిటెడడ్ మోటార్ వాహనాలు, బ్యాటరీ వీల్ఛైర్లు, లాప్టాప్స్, ఆపదలో ఉన్న చిన్నారులను రక్షించేందుకు బాలరక్షా మొబైల్ వాహన ప్రారంభోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ పిహెచి చేస్తున్న శ్రీకాంత్‌రెడ్డికి, సాంబశివరావు, శ్రీనివాస్‌లకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేశారు. ఏ అంశంపై పిహెచ్‌లో రీ సెర్చ్ చేస్తున్నారని, ఏ సంవత్సరంలో ఉన్నారని, గైడ్స్ సలహాలు, సూచనలు ఎలా ఉన్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రీ సెర్కు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయా అంటూ దివ్యాంగులతో ముఖాముఖి నిర్వహించి విజయవంతంగా పిహెచ్ పూర్తి చేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. బ్యాటరీతో రిట్రోఫిటెడడ్ మోటార్ వాహనాలు, బ్యాటరీ వీల్ఛైర్లు దివ్యాంగులకు చాలా ఉపయోగమని చెప్పారు. బ్యాటరీతో నడిచే ఈ వాహనాలు రీ చార్జ్ చేసుకునే సౌలభ్యం ఉందని, జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఓబియంఎస్ విధానంలో ఆన్లైన్ చేసిన దివ్యాంగులకు ప్రభుత్వ నియబ నిబంధనలు ప్రాధాన్యతననుసరించి వాహనాలు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. ఓబియంఎస్ ఆన్లైన్ చేసుకున్న దివ్యాంగులకు విడతలు వారిగా ప్రతి బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలు పంపిణీ చేస్తామని చెప్పారు. బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలతో దివ్యాంగులు ఇతరులపై ఆధారపడకుండా వారంతట వారే స్వయంగా వెళ్లడానికి అవకాశం ఉన్నదని చెప్పారు. 0-18 సంవత్సరాల వయస్సున్న ఆపదలో, పనుల్లో ఉన్న చిన్నారులను, బాల్య వివాహాలను అరికట్టేందుకు బాలరక్షక్ మొబైల్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఛైల్డ్ ఫ్రెండ్లీ జిల్లాగా మార్చాలని చెప్పారు. ఆపదలో ఉన్న చిన్నారులను రక్షించేందుకు 1098 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ రాగానే తక్షణమే మొబైల్ వాహనం చేరుకుని చిన్నారుల రక్షణ చర్యలు చేపడుతుందని చెప్పారు. ఆపదలో ఉన్న చిన్నారుల, బాల్య వివాహాల సమాచారాన్ని, పనుల్లో ఉన్న చిన్నారుల సమాచారం 1098 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేస్తే తక్షణమే అధికారులు చేరుకుంటారని చెప్పారు. గుర్తించిన చిన్నారులను బాల రక్షణ కమిటి ముందు హాజరు పరచి ప్రభుత్వ పరంగా రక్షణ చర్యలతో పాటు విద్యాబ్యాసం కల్పనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాహనానికి జిపిఎస్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏదేని సమయంలో చిన్నారులు ఆపదలో ఉన్నట్లు సమాచారం అందినా జాస్యం చేయక తక్షణమే హాజరు కావాలని ఆయన సూచించారు. పనుల్లో ఉన్న చిన్నారులను, ఆపదలో ఉన్న చిన్నారులను గుర్తించడం, కాపాడుటకు ఈ వాహనం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. 24 గంటల్లో ఎపుడైనా కంట్రోల్ రూముకు ఫోన్ చేయొచ్చునని చెప్పారు. అనంతరం కలెక్టర్ వాహనాలు పొందిన దివ్యాంగులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ వాహనాలు ఏ విధంగా ఉపయోగ పడతాయని అడిగి తెలుసుకున్నారు.

 

బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలు, ట్రై సైకిళ్లు, ల్యాప్‌ట్యాప్‌లు పొందిన దివ్యాంగులు ఈ పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. వాహనాలు ఇప్పించుటలో ప్రత్యేక చర్యలు చొరవ తీసుకున్నందుకు జిల్లా కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇతరుల సాయం లేనిది బయటకు వెళ్లడానికి ఇబ్బంది పడే పరిస్థితి నుండి తమకు తాముగా వెళ్లడానికి అవకాశం ఉన్నదని చెప్పారు.

 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి వరలక్ష్మి, బాలల సంరక్షణ అధికారి హరికుమారి, జిల్లా ఛైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ రాజ్‌కుమార్, బాలల హక్కుల పరిరక్షణ కమిటి సభ్యులు అంబేద్కర్, సాధిక్పాష, దివ్యాంగుల సంఘ జిల్లా అధ్యక్షులు సతీష్ తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post