ఉప సర్పంచ్ ఆర్కుటి సంతోష్ పై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం – అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ

ఉప సర్పంచ్ ఆర్కుటి సంతోష్ పై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం – అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ

ప్రచురణార్థం

ఉప సర్పంచ్ ఆర్కుటి సంతోష్ పై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం – అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ

పెద్దకల్వల, పెద్దపల్లి మండలం,
సెప్టెంబర్ -30:

పెద్దపల్లి మండలంలోని పెద్దకల్వల గ్రామ ఉపసర్పంచ్ ఆర్కుటి సంతోష్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ తెలిపారు.

పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి అదనపు బాధ్యతలు ఉన్న నేపథ్యంలో శుక్రవారం పెద్దకల్వల గ్రామపంచాయితీ లో నిర్వహించిన అవిశ్వాస తీర్మాన కార్యక్రమానికి అదనపు కలెక్టర్ హాజరయ్యారు.

సెప్టెంబర్ 7న గ్రామ ఉపసర్పంచ్ ఆర్కుటి సంతోష్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని, దీనికి సంబంధించి వార్డు సభ్యులకు సెప్టెంబర్ 15న నోటీసులు అందించామని, ఈ రోజు నిర్వహించిన అవిశ్వాస తీర్మాన సమావేశంలో 9 మంది వార్డు సభ్యులు హాజరయ్యారని, ఒక వార్డు సభ్యులు గైర్హాజరయ్యారని అదనపు కలెక్టర్ తెలిపారు.

అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 3, వ్యతిరేకంగా 6 మంది వార్డు సభ్యులు తమ ఓటు నమోదు చేశారని, అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 6 గురు ఓటు వేసినందున అవిశ్వాసం వీగిపోయిందని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎం.పి.ఓ. సుదర్శన్, సర్పంచ్, వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
————————————————————-

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది.

Share This Post