ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికల ప్రక్రియ జరిగే విధంగా వివిధ రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ వి. గౌతమ్ తెలిపారు.

ప్రచురణార్ధం.

నవంబరు 11, ఖమ్మం:

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికల ప్రక్రియ జరిగే విధంగా వివిధ రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ పై  వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్, పోలీసు కమీషనర్ విష్ణు, యస్. వారియర్ సమావేశమై ఎన్నికల ప్రక్రియ గురించి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం షెడ్యూల్ ననుసరించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికకు గాను ఈ నెల 16 న నోటిఫికేషన్ విడుదల కానున్నదని, నవంబరు 23 న నామినేషన్ చివరి తేదీ. కాగా, నవంబరు 24న నామినేషన్ల పరిశీలన ఉంటుందని, నవంబరు 26 న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు అని, డిశంబరు 10వ తేదీ ఉదయం 08.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్ నిర్వహించబడుతుందని, డిశంబరు 14 వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు డివిజన్ కేంద్రాలలో పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వీటిపై తమ అభిప్రాయాలను తెలియజేయాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కలెక్టర్ కోరారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం డివిజన్ పరిధిలో ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం, కల్లూరు డివిజన్లో కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కొత్తగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం, భద్రాచలం డివిజన్లో సబ్ కలెక్టర్ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 769 మంది ఓటర్లు ఉన్నట్లుగా, కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, జడ్నీ టి.సిలు, ఎం.పి.టి.సిలు, ఎక్స్ అఫీసియో సభ్యులను కలుపుకొని ఖమ్మం డివిజన్లో 324 మంది, కల్లూరు డివిజన్లో 115 మంది కొత్తగూడెం డివిజన్లో 222 మంది, భద్రాచలం డివిజన్లో 66 మంది, మహబూబాబాద్ జిల్లాలోని గార్ల, బయ్యారంకు సంబంధించి 24 మంది అదేవిధంగా వాజేడు, వెంకటాపురంకు సంబంధించి 18 మంది ఓటర్లు ఉన్నారని, ఇట్టి ఓటర్ల ముసాయిదా జాబితాను ఈ నెల 15 లోగా అందజేస్తామని వీటిపై అభ్యంతరాలు ఉన్న యెడల నవంబరు 20వ తేదీలోగా తెలియపర్చాలని కలెక్టర్ కోరారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారని, ఖమ్మం, కొత్తగూడెం అదనపు కలెక్టర్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని, సభలు, సమావేశాలు, ఇతర ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన అనుమతులను అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు జారీచేస్తారని, సింగిల్ విండో పద్ధతిన అనుమతుల జారీ ప్రక్రియ ఉంటుందని 45 గంటల ముందు అనుమతుల దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల సమాచారం ఇతర సమస్యల కొరకు “1950” టోల్ ఫ్రీ నెంబర్ కాల్ సెంటర్ ద్వారా, అదేవిధంగా “9063211298” సెల్ నెంబర్కు కాల్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించ పచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు.

పోలీసు కమిషనర్ విష్ణు యస్ వారియర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని, అన్ని రాజకీయపార్టీలు ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా పాటించాలని ఎన్నికలకు సంబంధించిన ప్రతి ప్రక్రియ పోలీసు నిఘాలో వీడియో గ్రఫీ చేయబడుతుందని ఓటర్లను ప్రభావితం చేసే చర్యలకు పాల్పడటం ప్రవర్తన నియమావళికి విరుద్ధమని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకనుగుణంగా బహిరంగ ప్రదేశంలో 5 వందల మంది, ఇండోర్ సమావేశాలకు అయితే 2 వందల మందికంటే మించరాదని, కోవి డ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని పోలీసు కమీషనర్ తెలిపారు.

అదనపు కలెక్టర్ ఎన్. మధుసూధన్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అప్పారావు, ఏ.సి.పి. ప్రసన్న కుమార్, ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్రనాథ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు మహ్మద్ జావీద్, జి.కృష్ణ, సి.హెచ్. నాగేశ్వరరావు, ఎన్. కోటేశ్వరరావు, సింగు నర్సింహారావు, పొ న్నం వెంకటేశ్వరరావు, కూరపాటి వెంకటేశ్వర్లు, టి. కృష్ణమోహన్, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post