ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని జిల్లా స్థాయి క్యాడర్ ఉద్యోగులు తమ అప్షన్లను తమ కార్యాలయపు ఉన్నతాధికారులకు వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు.

ప్రచురణార్ధం

డిశంబరు, 14,ఖమ్మం:

ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని జిల్లా స్థాయి క్యాడర్ ఉద్యోగులు తమ అప్షన్లను తమ కార్యాలయపు ఉన్నతాధికారులకు వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో . ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యోగుల విభజన ప్రక్రియపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రపతి ఆమోదించిన కొత్త జోనల్ వ్యవస్థ -2018 కనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం సీనియారిటీ ప్రాతిపదికన జిల్లా స్థాయి క్యాడర్ ఉద్యోగుల విభజనకు సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఉమ్మడి జిల్లాల్లోని ఉద్యోగుల నుండి ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు సమర్పించే విధంగా ఉద్యోగులకు తెలియపర్చాలని, ఈ నెల 16 లోగా ఆప్షన్ల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి శిరీష, అడిషనల్ డి.సి.సి గౌస్ ఆలా, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు..

Share This Post