ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనమండలి ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సెక్టోరల్ అధికారులు సహాయ ప్రిసైడింగ్ అధికారుల సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో జరిగేలా తమ విధులను సమర్ధవంతంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.పి. గౌతమ్ అన్నారు.

ప్రచురణార్ధం

డిశంబరు 06, ఖమ్మం

ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనమండలి ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సెక్టోరల్ అధికారులు సహాయ ప్రిసైడింగ్ అధికారుల సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో జరిగేలా తమ విధులను సమర్ధవంతంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.పి. గౌతమ్ అన్నారు. ఈ నెల 10వ తేదీన జరుగనున్న పోలింగ్ ప్రక్రియకు సంబంధించి సోమవారం నగరంలోని డి.పి. ఆర్.సి భవనంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా సెక్టోరల్ అధికారులు, నోడల్ అధికారులు, పోలింగ్ అధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో పోలింగ్ ప్రక్రియపట్ల జిల్లా కలెక్టర్ దిశా నిర్దేశం చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనమండలి ఎన్నిక పోలింగ్కు ఉమ్మడి జిల్లాలో నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఖమ్మం, కల్లూరు, కొత్తగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి. కార్యాలయం, భద్రాచలంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని. -ఉమ్మడి జిల్లాలో 768 మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని కలెక్టర్ తెలిపారు. ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయపు పోలింగ్ కేంద్రంలో 348 మంది, కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయపు పోలింగ్ కేంద్రంలో 115 మంది, కొత్తగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయపు పోలింగ్ కేంద్రంలో 221 మంది అదేవిధంగా భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయపు పోలింగ్ కేంద్రంలో 84 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు పోలింగ్ నిర్వహణకు ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఓ.పి.ఓల రెండు విడతలుగా శిక్షణా తరగతులను నిర్వహించి సంసిద్ధం చేసామని కలెక్టర్ అన్నారు. బ్యాలెట్ పేపర్ పద్ధతిన పోలింగ్ జరుగుచున్నందున అధికారులు చిన్న పొరపాటు కూడా జరుగకుండా పూర్తి అప్రమత్తతతో ముందస్తు ఏర్పాట్లతో సమగ్ర అవగాహనతో పోలింగ్ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు ఈ నెల 9వ తేదీన డి పి.ఆర్.సి భవనంలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి పోలింగ్ సామాగ్రితో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు పోలీసు బందోబస్తుతో చేరుకోవాలని కలెక్టర్ అన్నారు. ఆయా పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ అధికారులు, సిబ్బందికి వసతి, భోజన ఏర్పాట్లను సమకూర్చాలని రెవెన్యూ “డివిజనల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సెక్టోరల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్ పోలింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రిసైడింగ్ అధికారులతో సమన్వయం కలిగి ఉండాలన్నారు. పోలింగ్ అనంతరం. పటిష్ట పోలీసు బందోబస్తుతో పోలింగ్ కేంద్రాల నుండి బ్యాలెట్ బాక్సులను రెసెప్షన్ కేంద్రంలో అప్పగించాలని కలెక్టర్ సూచించారు. పోలింగ్ సిబ్బంది, మెటీరియల్ రవాణాకు అవసరమైన వాహనాలను సంసిద్ధంగా ఉండాలని రవాణా శాఖాధికారిని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్, రెసెప్షన్, స్ట్రాంగ్ రూమ్ , కౌంటింగ్ హాల్ లో అగ్నిమాపక నిరోధక ఏర్పాట్లను ముందస్తుగానే చేయాలని జిల్లా అగ్నిమాపక శాఖాధికారిని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ముందస్తుగానే శానిటేషన్ పనులను చేపట్టాలని మున్సిపల్ కమీషనర్లను కలెక్టర్ ఆదేశించారు. కోవి డ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అందుకు అవసరమైన తగు ఏర్పాట్లను చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని కలెక్టర్ ఆదేశించారు.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అదనపు కలెక్టర్లు, సహాయ రిటర్నింగ్ అధికారులు ఎస్. మధుసూదన్, వెంకటేశ్వర్లు, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, సెక్టోరల్ నోడల్ అధికారులు, ప్రిసైడింగ్ సహాయ ప్రిసైటింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post