ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనమండలి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎన్నికల ప్రవర్తనా నియమావళీ కనుగుణంగా సజావుగా జరిగేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీసు కమిషనర్ విష్ణు యస్. వారియర్ కోరారు.

ప్రచురణార్ధం

డిశంబరు-08, ఖమ్మం:

ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనమండలి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎన్నికల ప్రవర్తనా నియమావళీ కనుగుణంగా సజావుగా జరిగేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీసు కమిషనర్ విష్ణు యస్. వారియర్ కోరారు. బుధవారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనమండలి ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పోలింగ్ ప్రక్రియను వారు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వారీగా కేటాయించబడిన బ్యాలెట్ పేపర్లు బ్యాలెట్ బాక్సుల వివరాలను అభ్యర్థులకు అందజేయడం జరిగిందని, ఈ నెల 9 వ తేదీన నగరంలోని డి.పి.ఆర్.సి భవనంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి పోలింగ్ మెటీరియల్, పోలింగ్ సిబ్బంది, పోలీసు బందోబస్తుతో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారని, ఈ నెల 10 వ. తేదీన పోలింగ్ ముగిసిన పిమ్మట, బ్యాలెట్, బ్యాలెట్ బాక్సులు, ఇతర పోలింగ్ మెటీరియల్ను స్ట్రాంగ్ రూముక్కు చేరుస్తారని, అభ్యర్థుల సమక్షంలో పోలింగ్ బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లో భద్రపర్చడం జరుగుతుందని, ఈ నెల 11 వ తేదీన కౌటింగ్ జరుగనున్న నేపథ్యంలో కౌంటింగ్ తేదీ వరకు అభ్యర్థులు తమ ఏజెంట్లను స్ట్రాంగ్రూమ్ వద్ద నిఘా కొరకు ఉంచవచ్చని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ రోజున ఓటరును మాత్రమే పోలింగ్ కంపార్ట్మెంట్లోకి అనుమతి ఉంటుందని, సీక్రసీ అఫ్ ఓటింగ్ను పూర్తిగా అమలు చేయడం జరుగుతుందని. కలెక్టర్ అన్నారు అభ్యర్థి, పోలింగ్, కౌటింగ్ ఏజెంట్లు తప్పనిసరిగా రెండు డో సులు వ్యాక్సినేషన్ తీసుకొని ఉ న్న ట్లుగా ధృవీకరణ చూపాలని రెండు డోసులు కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్న పోలింగ్ అధికారులు, సిబ్బందిని మాత్రమే పోలింగ్ విధులకు కేటాయించామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి సెక్టార్ మెజిస్ట్రేటిన్ను నియమించామని, ఓటరు గుర్తింపుకై సంబంధిత మండల అధికారిని ప్రత్యేకంగా నియమించామని, శాసనమండలి ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు.

పోలీసు కమిషనర్ విష్ణు. యస్. వారియర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళీ అమలులో భాగంగా ఈ రోజు సాయంత్రం 4.00 గంటల నుండి “డ్రై డే” అమలులో ఉంటుందని, పోలింగ్ లోకేషన్లలో ప్రత్యేక క్లాక్ రూమ్  లను  ఏర్పాటు చేసామని, పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళేముందు సెల్ఫోన్లు, పెన్నులు ఇతర వస్తువులు క్లాక్ రూమ్లో అప్పగించి ఓటు హక్కు వినియోగించుకున్న పిదప తిరిగి తీసుకోవాల్సి ఉంటుందని. పోలీసు కమీషనర్ తెలిపారు. పోలింగ్ కేంద్రానికి వంద మీరట్ల దూరాన్ని ఖచ్చితంగా పాటించాలని ఏదైనా సమస్య ఉంటే సంబంధిత లోకేషన్లో గల పోలీసు అధికారుల దృష్టికి తేవాలని తెలిపారు. పోలింగ్ కేంద్రంతో పాటు నిర్దేశించిన పరిసర ప్రాంతాలలో కోవిడ్-19 నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని పోలీసు కమిషనర్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళీ ప్రకారం పోలింగ్ జరిగేలా సహకరించాలని ఆయన కోరారు.

అదనపు కలెక్టర్, సహాయ రిటర్నింగ్ అధికారి ఎన్ మధుసూదన్, నోడల్ అధికారి వి. అప్పారావు, అభ్యర్థులు రాయల నాగేశ్వరరావు, కొండపల్లి శ్రీనివాసరావు, అభ్యర్థుల ప్రతినిధులు నల్లమల వెంకటేశ్వరరావు, కన్నారావు, ఎన్నికల విభాగపు సూపరింటెండెంట్ రాంబాబు, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post