ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనమండలి ఎన్నికల పోలింగ్ ను పురస్కరించుకొని నగరంలోని డి.పి.ఆర్.సి భవనంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఏర్పాట్లను గురువారం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పోలీసు కమీషనర్ విష్ణు. యస్.వారియర్తో కలిసి పరిశీలించారు.

ప్రచురణార్ధం

డిశంబరు 09, ఖమ్మం –

ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనమండలి ఎన్నికల పోలింగ్ ను పురస్కరించుకొని నగరంలోని డి.పి.ఆర్.సి భవనంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఏర్పాట్లను గురువారం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పోలీసు కమీషనర్ విష్ణు. యస్.వారియర్తో కలిసి పరిశీలించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నాలుగు పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన పోలింగ్ అధికారులు, సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లతో వారు సమావేశమయి పలు సూచనలు దేశాలు చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాల కనుగుణంగా అధికారులు రెండు విడతలుగా పొందిన పోలింగ్ నిర్వహణ శిక్షణ ప్రకారం పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అన్నారు. ఈ నెల 10 వ తేదీ ఉదయం 8:00 గంటలకు పోలింగ్ ప్రారంభమయి సాయంత్రం 4.00 గంటల వరకు కొనసాగుతుందని, మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ ప్రక్రియను సూక్ష్మపరిశీలన చేయాలని, ఓటర్లను గుర్తించేందుకు గాను సంబంధిత మండలం, మున్సిపాలిటీ, ఎం.పి.ఓలు, కమీషనర్లు అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు. కోవిడ్-19 నిబంధనలు. పూర్తిగా పాటిస్తూ పోలింగ్ విధులను నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన నాలుగు కౌంటర్లలో అయా పోలింగ్ అధికారులు, సిబ్బంది తీసుకున్న పోలింగ్ సామాగ్రిని పరిశీలించి మరొకమారు పోలింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించి సందేహాలను నివృత్తి చేసారు. అనంతరం నాలుగు కేంద్రాలకు కేటాయించిన బస్సులలో పోలింగ్ అధికారులు, సిబ్బంది. మైక్రో అబ్జర్వర్లు, పోలింగ్ సామాగ్రితో ఆయా పోలింగ్ కేంద్రాలకు పోలీసు బందోబస్తుతో కేటాయించిన బస్సులలో పంపించారు.

అదనపు కలెక్టర్, సహాయ రిటర్నింగ్ అధికారి ఎస్. మధుసూదన్, నోడల్ అధికారులు శ్రీరామ్, శైలేంద్ర, మదన్ గోపాల్, ఎన్నికల విభాగపు సూపరింటెండెంట్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Share This Post