ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గంనకు సోమవారం నాడు రెండు నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి.పి. గౌతమ్ తెలిపారు.

ప్రచురణార్ధం

నవంబరు, 22,ఖమ్మం:–

ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గంనకు సోమవారం నాడు రెండు నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి.పి. గౌతమ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి మధుసూధన్ తాతా, ఇండిపెండెంట్ గా  కొండపల్లి శ్రీనివాసరావు తమ నామినేషన్లను అందిజేసినట్లు కలెక్టర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి మధుసూథన్ తాతా, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ తో కలిసి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.

అదనపు కలెక్టర్, సహాయ రిటర్నింగ్ అధికారి ఎన్. మధుసూధన్, ఎన్నికల నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post