ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల నామినేషన్స్ ను బుధవారం కలెక్టరేట్ ప్రజ్ఞ సమావేశ మందిరంలో ఎన్నికల పరిశీలకులు సి. సుదర్శన్ రెడ్డి సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పరిశీలించారు.

ప్రచురణార్ధం

నవంబరు 24, ఖమ్మం –

ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల నామినేషన్స్ ను బుధవారం కలెక్టరేట్ ప్రజ్ఞ సమావేశ మందిరంలో ఎన్నికల పరిశీలకులు సి. సుదర్శన్ రెడ్డి సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పరిశీలించారు. నలుగురు అభ్యర్థులచే (కొండపల్లి శ్రీనివాసరావు ఇండిపెండెంట్, మధుసూదన్ తాతా టి.ఆర్.ఎస్.,  రాయల నాగేశ్వరరావు కాంగ్రెస్, కొండ్రు సుధారాణి ఇండిపెండెంట్) సమర్పించబడిన నామినేషన్స్ పరిశీలించిన అనంతరం నలుగురు అభ్యర్థుల నామినేషన్లు సరిగా ఉన్నాయని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ తెలిపారు.

నామినేషన్ల పరిశీలనలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, ఎన్నికల నోడల్ అధికారులు, కె. శ్రీరామ్, శైలేం ద్ర,  మదన్ గోపాల్, అభ్యర్థులు మధుసూదన్ తాతా, రాయల నాగేశ్వరరావు, కొండపల్లి శ్రీనివాసరావు, కొండ్రు సుధారాణి పాల్గొన్నారు.

Share This Post