ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఈ నెల 14వ తేదీ మంగళవారం ఉదయం 8.00 గంటలకు ప్రారంభమవుతుందని, పోటీలో ఉన్న అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు ఉదయం.. 7.00 గంటలలోపు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.పి. గౌతమ్ తెలిపారు.

ప్రచురణార్ధం

డిశంబరు, 13, ఖమ్మం:

ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఈ నెల 14వ తేదీ మంగళవారం ఉదయం 8.00 గంటలకు ప్రారంభమవుతుందని, పోటీలో ఉన్న అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు ఉదయం.. 7.00 గంటలలోపు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.పి. గౌతమ్ తెలిపారు. సోమవారం డి.పి.ఆర్.సి భవనంలో పోటీలో ఉన్న అభ్యర్థులకు కౌంటింగ్ ప్రక్రియ పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇట్టి అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన జరిగిన పోలింగ్ ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగిందని, ఓట్లు పోలైన బ్యాలెట్ బాక్సులను అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లో భద్రపర్చి, నిరంతరాయంగా మూడు అంచెల భద్రత కల్పించడం. జరిగిందన్నారు. ఈ నెల 14 వ తేదీ ఉదయం 8.00 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, ఉదయం 7.00 గంటలలోపు అభ్యర్థులు, లేదా వారి ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని, ఎన్నికల సాధారణ పరిశీలకులు, అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ నుండి బ్యాలెట్ బాక్సులను కొంటింగ్ హాలుకు తరలించడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్ల ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని, కౌంటింగ్ కేంద్రంలో అభ్యర్థులు, ఏజెంట్ల కొరకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. దీనితో పాటు సాధారణ పరిశీలకులు, రిటర్నింగ్ అధికారి టేబుళ్ళను ఏర్పాటు చేసామని ఓట్ల లెక్కింపు కొరకు 4 టేబుళ్ళను ఏర్పాటు చేయడం జరిగిందని, ఓట్ల లెక్కింపుకు గాను సిబ్బందికి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి పూర్తిగా సంసిద్ధం చేసామని కలెక్టర్ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన నాలుగు పోలింగ్ కేంద్రాలలో ప్రతి పోలింగ్ కేంద్రంలో కేవలం ఒక్క బ్యాలెట్ బాక్సును మాత్రమే వినియోగించడం జరిగిందని, బ్యాలెట్ పేపర్ల అకౌంట్, పేవర్ సీల్ అకౌంట్ వివరాలను పోలింగ్ ఏజెంట్లకు అందజేయడం జరిగిందని తదనుగుణంగా కౌంటింగ్ రోజు బ్యాలెట్ బాక్సులను తెరిచే సమయంలో సరిచూసుకోవాలని కలెక్టర్ అన్నారు. మొదటి, రెండవ ప్రాధాన్యత పరంగా ఓట్ల లెక్కింపు ఉంటుందని, కౌంటింగ్ కేంద్రంలో పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఉంటుందని, పోలింగ్ కేంద్రంలో సెల్ ఫోన్లు , పెన్నులు, పేపర్లు ఇతర ఎటువంటి వస్తువులు అనుమతించ బడవని కలెక్టర్ తెలిపారు. ఈ నెల 10వ తేదీన జరిగిన పోలింగ్ రోజున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 738 ఓట్లు పోలైనట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా అభ్యర్థుల సందేహాలను కలెక్టర్ నివృత్తి చేసారు..

అదనపు కలెక్టర్, సహాయ రిటర్నింగ్ అధికారి ఎన్. మధుసూదన్, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి మధుసూదన్ తాతా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు, ఇండిపెండెంట్ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావు, మరో ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రతినిధి, నోడల్ అధికారులు, ఎన్నికల విభాగపు సూపరింటెండెంట్ రాంబాబు, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు..

Share This Post