ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పేద ప్రజలకు వైద్య సేవలను అందించుటకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు కృషి చేయాలనిజిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు.

* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి సెప్టెంబర్ 14 (మంగళవారం).

జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యను కలిసి ఈనెల 19 ఆదివారం నాడు రామప్ప హరిత హోటల్ లో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జోనల్ కాన్ఫరెన్స్ 2021 కు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా కోరిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు. మంగళవారం వరంగల్ ఉమ్మడి జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ని కలిసి ఈ నెల 19న ఆదివారం నాడు ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప హరిత హోటల్ లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ జోనల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావలసిందిగా కోరినారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కాన్ఫరెన్స్ కు హాజరవుతానని తెలుపి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పేద ప్రజలకు వైద్య సేవలను అందించుటకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు కృషి చేయాలని అన్నారు. అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి మరియు ములుగు జిల్లాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంపులను నిర్వహించి పేద ప్రజలకు రక్తాన్ని అందుబాటులో ఉంచాలని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవనాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సందర్భంగా టిఎస్ ఐఎంఏ జోనల్ కాన్ఫరెన్స్ 2021 బ్రోచర్ ను విడుదల చేశారు. రామప్పకు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభించినందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈవి సినివాసరావు శాలువాతో జిల్లా కలెక్టర్ ను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ బ్రాంచ్ ఐఎంఎ వైస్ ప్రెసిడెంట్ మరియు ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్.ఎం.సుదీప్, తాన ప్రెసిడెంట్ డాక్టర్ ప్రవీణ్, ఐఎంఎ సభ్యులు డాక్టర్. కాళీప్రసాద్ రావ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, డిపిఆర్ఓ బి.రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయనైనది.

Share This Post