*ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎం. ఎల్.సి కి 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు

*ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎం. ఎల్.సి కి 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు*
 నల్గొండ,నవంబర్ 23.  ఉమ్మడి నల్గొండ జిల్లా  స్థానిక సంస్థల శాసన మండలి నియోజకవర్గము నకు నామినేషన్ల దాఖలు కు చివరి రోజు మంగళవారం( తేదీ 23.11.2021 )  11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు రిటర్నింగ్ అధికారి,నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు దాఖలు చేశారు.టి.ఆర్.యస్ పార్టీ అభ్యర్థి గా యం.కోటి రెడ్డి మూడు సెట్ల నామినేషన్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి,మాజీ రాష్ట్ర శాసన మండలి చైర్మన్,ఎం.ఎల్.సి.గుత్తా సుఖేందర్ రెడ్డి ,శాసన సభ్యులు నోముల భగత్,గాదరి కిషోర్,చిరుమర్తి లింగయ్య,డి.రవీంద్ర కుమార్,  ప్రభుత్వ విప్ గొంగిడి సునీత లతో కలిసి మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.10 మంది స్వతంత్ర అభ్యర్థులు ఒక్కొక్కరు ఒక సెట్ చొప్పున నామినేషన్లు  రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నిన్నటి వరకు ఒక్కరూ నామినేషన్ దాఖలు చేయలేదు.మంగళ వారం చివరి రోజున 11 మంది అభ్యర్థులు 13 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.స్వతంత్ర అభ్యర్ధులు గా కాసర్ల వెంకటేశ్వర్లు, రాం సింగ్ కొర్రా,బెజ్జం సైదులు,బడుగుల రవీందర్,పాదురు గోవర్దని,తందు సైదులు,అరుపుల శ్రీశైలం,కుడుదుల నగేష్,లక్ష్మయ్య వంగూరి, దాచేపల్లి నాగేశ్వర్ రావు లు ఒక్కొక్కరు ఒక సెట్ చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు.

Share This Post