ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ మరియు తెలంగాణ బి. సి. స్టడీ సర్కిల్, నల్లగొండ వారి సంయుక్త ఆధ్వర్యంలో రాజ్యాంగ పీఠిక పఠనము, రాజ్యాంగ హక్కులు, విధులుపై చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు

ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ మరియు తెలంగాణ బి. సి. స్టడీ సర్కిల్, నల్లగొండ వారి సంయుక్త ఆధ్వర్యంలో రాజ్యాంగ పీఠిక పఠనము, రాజ్యాంగ హక్కులు,  విధులుపై చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి మాట్లాడుతూ రాజ్యాంగములోని ప్రతీ ఆర్టికల్ అవగతం చేసుకొని హక్కులు సాధించటమే కాదు , విధులు నిర్వర్తించాలని, సమానత్వం, సౌబాతృత్వం వర్డిల్లినప్పుడే రాజ్యాంగ కర్త డా. బి. ఆర్ అంబేద్కర్ కు అందించే నిజమైన కృతజ్ఞత అని, న్యాయ సేవా అధికార సంస్థ చట్టం ద్వారా సమ న్యాయం అందించగలుగుతున్నామని , విద్యార్థులు ఈ స్టడీ సర్కిల్ ఉపయోగించుకొని గొప్ప అధికారులుగా వెలగాలని, ప్రజా సేవలో తరించాలని విద్యార్థులను కోరారు. కార్యక్రమములో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లేటీ ప్రభాకర్, బి. సి. స్టడీ సర్కిల్ డైరెక్టర్ విజయ్ కుమార్, బి.సి.వెల్ఫేర్ అధికారిని కృష్ణవేణి , జూనియర్ కళాశాల లెక్చరర్ కొండల్,
 విద్యార్థులు పాల్గొన్నారు.

Share This Post