ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జి. వేణు న్యాయ సేవలు

ప్రెస్ రిపోర్ట్: 17.09.2021: ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జి. వేణు న్యాయ సేవలు మరియు జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ రూపొందించిన మొబైల్ అప్లికేషన్ వాటిపై మీ సేవ కేంద్ర నిర్వాహకులకు, పారా లీగల్ వాలంటీర్స్ నకు అవగాహన కార్యక్రమము నిర్వహించారు. ఈ సందర్బముగా న్యాయమూర్తి మాట్లాడుతూ ఈరోజు దేశ వ్యాప్తముగా న్యాయ సేవలపై అవగాన కల్పిస్తూ సాధారణ పౌరులకు న్యాయ సేవలు అందించటానికి ఆన్లైన్ ద్వారా ధరఖాస్తుల అప్లోడ్ చేసే విధానంపై అవగాహన కల్పించారు. నల్లగొండ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు మేడ మోహన్ రెడ్డి మాట్లాడుతూ న్యాయ సేవలకై న్యాయవాదులు కూడా సామాజిక బాధ్యతగా తమవంతు సేవలు అందిస్తున్నారు. కార్యక్రమములో ప్యానల్ న్యాయవాది లెనిన్ బాబు  మీ సేవ నిర్వాహకులు , శిక్షణలో ఉన్న పారా లీగల్ వాలంటీర్స్ పాల్గొన్నారు.

Share This Post