ఉమ్మడి మెదక్ జిల్లాలో దళిత బంధు అమలు ప్రక్రియను వేగవంతం చేయాలి ఫిబ్రవరి మొదటి వారానికల్లా లబ్ధిదారుల ఎంపిక పూర్తి కావాలి మార్చి 5 లోగా గ్రౌండింగ్ పూర్తి చేయాలి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి….. మంత్రి తన్నీరు హరీష్ రావు

ఉమ్మడి మెదక్ జిల్లాలో దళిత బంధు అమలు ప్రక్రియను వేగవంతం చేయాలి

ఫిబ్రవరి మొదటి వారానికల్లా లబ్ధిదారుల ఎంపిక పూర్తి కావాలి

మార్చి 5 లోగా గ్రౌండింగ్ పూర్తి చేయాలి

లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి….. మంత్రి తన్నీరు హరీష్ రావు

దళితుల సాధికారత కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో దళిత బంధు అమలుపై గురువారం హైదరాబాదులోని అరణ్య భవన్ లో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు సమీక్షించారు.

ఎమ్మేల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్, మాణిక్ రావు, ఒడితెల సతీష్ కుమార్, ఎఫ్ డీ సి ఛైర్మెన్ వంటెరు ప్రతాప రెడ్డి, జిల్లాల కలెక్టర్లు హన్మంత రావు, హరీశ్, అదనపు కలెక్టర్లు, ఆయా శాఖల విభాగాల అధికారులు పాల్గొన్నారు.

ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యే విధంగా నియోజకవర్గానికి 100 కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని మొదటి విడతగా అమలు చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

ప్రతి నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లలను ఆదేశించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం, గ్రామాల ఎంపిక, లబ్ధిదారుల ఎంపిక త్వరగా పూర్తి చేయాలన్నారు. మార్చి 5 లోగా యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఫిబ్రవరి మొదటి వారం వరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని, అనంతరం లబ్ధిదారుల పేరిట దళిత బంధు ప్రత్యేక బ్యాంక్ ఖాతాలు తెరవాలని సూచించారు. మార్చి 5లోగా గ్రౌండింగ్ అయ్యేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు.

పది లక్షల్లో గరిష్ఠంగా మూడు యూనిట్లు పెట్టుకొనే అవకాశం ఉందని, ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఒకే యూనిట్ పెట్టుకునే అవకాశం కూడా ఉందని తెలిపారు.

లబ్ధిదారుల ఖాతాల్లోకి 9.90 లక్షలు వెళతాయని, మిగిలిన పది వేలకు తోడు ప్రభుత్వం మరో పది వేలు కలిపి దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేస్తుందన్నారు. ఏదీని పరిస్థితుల్లో లబ్ధిదారులు నష్టపోయిన సందర్భాల్లో కలెక్టర్ల వద్ద ఉండే దళిత రక్షణ నిధి వారికి అండగా ఉంటుందన్నారు.

దళిత బంధు పథకం దేశంలోనే అద్భుతమైన పథకమని, దళితుల సాధికారత కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు.

దళిత బందులో లబ్ధిదారుల ఎంపిక మొదలుకుని, వారు తమకిష్టమైన యూనిట్ను ఎంచుకునే వరకు ఆయా అధికారులు, శాసనసభ్యులు క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. లబ్ధిదారులకు సరైన సూచనలు, సలహాలు ఇస్తూ అనువైన లాభదాయకమైన యూనిట్ ను ఎంపిక చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.

అనంతరం డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పురోగతిపై సమీక్షించారు.
ఉమ్మడి మెదక్ పరిధిలో మూడు జిల్లాల్లో నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇండ్లను వెంటనే అర్హులైన లబ్ధిదారులకు అందించడానికి చర్యలు చేపట్టాలన్నారు.

పురోగతిలో ఉన్న నిర్మాణాలు అన్నింటిని త్వరితగతిన పూర్తిచేసి లబ్ధిదారులకు అందించాలన్నారు.
రెండు పడకల గదుల ఇండ్ల అన్నింటిలోనూ అవసరమైన మౌలిక సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు.

పట్టణ ప్రాంతాలలో డబుల్ బెడ్ రూమ్ లు అందుకున్న లబ్ధిదారుల వివరాలను ఆన్ లైన్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

Share This Post