ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల నామినేషన్స్ ను బుధవారం రంగారెడ్డి జిల్లా ఎన్నికల పరిశీలకులు యం.చంపాలాల్ సమక్షంలో పరిశీలన – జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

05-ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల నామినేషన్స్ ను బుధవారం రంగారెడ్డి జిల్లా ఎన్నికల పరిశీలకులు యం.చంపాలాల్ సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పరిశీలించారు.

1) పట్నం మహేందర్ రెడ్డి, టి.ఆర్.ఎస్ అభ్యర్థిగా
2) సుంకరి రాజు, టి.ఆర్.ఎస్.అభ్యర్థిగా
3) చలికా చంద్రశేఖర్ స్వాతంత్ర్య అభ్యర్థిగా నామీనేషన్లు వేశారు.

చలికా చంద్రశేఖర్ స్వాతంత్ర్య అభ్యర్థి నామీనేషన్ పత్రం 3గంటల తరువాత సమర్పించినందున ప్రతిపాదకులచే సంతకాలు లేనందున, సెక్యూరిటీ డిపాజిట్ సమర్పించనందున నామీనేషన్ ను తిరస్కరించినట్లు జిల్లా ఎన్నికల అధికారి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ తెలిపారు.

నామినేషన్ల పరిశీలనలో అదనపు కలెక్టర్లు ప్రతీక్ జైన్ తిరుపతి రావు, నోడల్ అధికారి రాజేశ్వర్ రెడ్డి, అభ్యర్థులు పట్నం మహేందర్ రెడ్డి, సుంకరి రాజు, చలికా చంద్రశేఖర్, ఎన్నికల విభాగం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post