*ప్రెస్ రిలీజ్*
*హనుమకొండ / వరంగల్*
*మే 30*
*ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణ,కాకుండా పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు*
*నగర పోలీస్ కమిషనర్ డా తరుణ్ జోషీ, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, డా.గోపీలు*
సోమవారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయ మినీ సమావేశ మందిరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటే గుర్తించిన లెక్కల ప్రకారం స్థానిక తహశీల్దార్స్ రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచిస్తున్నారు.
హనుమకొండ *జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు* మాట్లాడుతూ
ప్రభుత్వ భూములు ఆక్రమంగా కబ్జా చెస్తే నిబంధనల ప్రకారం కటిన చర్యలు తీసుకుంటామని కబ్జా చేసిన వారి పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.
వారికి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు కుడా నిలిపివేసే అవకాశం ఉందని అన్నారు.
*వరంగల్ జిల్లా కలెక్టర్ డా.బి. గోపీ* మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే గుర్తించబడిన వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రత్యేకంగా నిలిపిన ప్రభుత్వ భూములలో అక్రమంగా కబ్జాలు చెసినట్లు తమ దృష్టికి వచ్చిందని అనవసరంగా ప్రభుత్వ భూములు, అస్తులు ఆక్రమణ చేస్తే చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్య రాణీ, డిసిపిలు వెంకట లక్ష్మీ, అశోక్ కుమార్, ఆర్డిఓలు వాసు చంద్ర, మహేందర్ జీ, రెవెన్యూ, పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.