ఉర్దూ మీడియం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు స్టడీ మెటీరియల్ పంపిణీ : జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్. లోక్ నాథ్ రెడ్డి

పత్రికా ప్రకటన.   తేది:24.05.2022, వనపర్తి.

ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువత ప్రభుత్వం అందిస్తున్న గ్రూప్స్ ఉచిత శిక్షణను, స్టడీ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ కొలువులు సాధించాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్. లోక్ నాథ్ రెడ్డి సూచించారు.
మంగళవారం వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (ఉర్దూ మీడియం) లో జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రూప్స్ I, II, III, & IV ఉద్యోగాలకు నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ శిబిరం, స్టడీ మెటీరియల్ జిల్లా పరిషత్ చైర్మన్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదవాలని, ఫ్యాకల్టీ అందించిన సూచనలు, సలహాలు పాటిస్తూ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత శిక్షణను, మెటీరియల్ ను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారిని నుషిత, డి.ఎస్.సి.డి. ఓ, ఎం.పి. టి.సి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
………
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post