పత్రికా ప్రకటన తేది:12.01.2022, వనపర్తి.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కొత్తగా అనుసరిస్తున్న సాఫ్ట్ వేర్ లను ఉపయోగిస్తూ వివిధ అంశాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో “సాఫ్ట్ మైగ్రేషన్” అనే అంశంపై ఎంపీడీవోలు, ఏ పీ ఓ లు, ఈ. సి. లు, టెక్నికల్ అసిస్టెంట్లు, అటవీశాఖ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగంలోని కంప్యూటర్ ఆపరేటర్లకు ఒక్కరోజు అవగాహన కార్యక్రమం ఆయన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంజిఎన్ఆర్ఇజిఎస్ పథకంలో భాగంగా ప్రస్తుతం నిర్వహిస్తున్న “రాగాస్” సాఫ్ట్వేర్ నుండి NIC యొక్క “నరేగా- సెక్యూర్” సాఫ్ట్ వేర్ కు ఉపాధి హామీ పథకం కార్యకలాపాలు మైగ్రేట్ అవుతాయని ఆయన సూచించారు. ఈ నెల 17వ తేదీ నుండి ఈ సాఫ్ట్వేర్ అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. సాఫ్ట్‌వేర్‌లో ఉత్పన్నమయ్యే వివిధ సమస్యలపై ఎలా అధిగమించాలి అనే అంశంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆయన సూచించారు. ఈ సాఫ్ట్వేర్ లో ఎస్టిమేషన్ తయారు, ఉపాధి పనుల కల్పన, కూలీలకు చెల్లింపులు, మాస్టర్స్ నిర్వహణ, వివిధ స్థాయిలలోని అధికారుల లాగిన్ సు నిర్వహణ- బాధ్యతలపై అవగాహన కల్పించినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని, అధికారులు సమస్యలను నివృత్తి చేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ నరసింహులు, అదనపు డి ఆర్ డి ఓ కృష్ణయ్య, రిసోర్స్ పర్సన్లు శ్రీపాద, కురుమయ్య, భాస్కర్, మురళి, ఖయ్యుం, రాము, ఏపీడి సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.
………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.