ఎంతమంది దాటితే అంత పుణ్యం…

ఎంతమంది దాటితే అంత పుణ్యం…

ప్రచురణార్థం

ఎంతమంది దాటితే అంత పుణ్యం…

మేడారం ఫిబ్రవరి 17.
అమ్మను స్వాగతించడానికి వేస్తున్న ముగ్గులు ఈ రంగవల్లికలని , ఈ ముగ్గులను ఎంతమంది దాటితే మాకంత పున్నెం అని ఖమ్మం జిల్లా దానవాయిగూడెం కు చెందిన డి సరోజినీ యశోద రాములక్క తెలిపారు.

మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరను పురస్కరించుకొని చిలకలగుట్ట రహదారిలో సమ్మక్క రాక సందర్భంగా పలువురు భక్తులు తమ మదిలో ఉన్న బలమైన కోరికలను అమ్మవార్లకు విన్నవించుకునేందుకు ముగ్గులతో జంతువులను బలి ఇవ్వడంలోనూ పలు రూపాలతో అనేక రకాలుగా స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.

వివిధ ప్రాంతాల నుండి కుటుంబాల సమేతంగా జాతరకు విచ్చేసిన వారిలో ఐక్యతను మరింత పెంపొందించు కుంటున్నారు గత కొన్ని రోజులుగా జాతర లో నివాసం ఏర్పరచుకొని రోజుకొక తీరుగా విందులు వినోదాలు ఏర్పాటు చేసుకుంటూ ఆనందంగా గడపడం వారికి ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అంటున్నారు.

అమ్మకు ఎదుర్కోలు

అమ్మకు ఎదుర్కోలు ఇవ్వడం అంటే తమకు ఎంతో సంతోషం అని తమ కుటుంబ సభ్యులందరూ రోడ్లు పరిశుభ్ర మరచి కల్లాపు జల్లి ముగ్గులు వేసి రంగవల్లికలతో తీర్చిదిద్ది ఆ కుటుంబం పొందే ఆనందం అంతా ఇంతా కాదు.
అమ్మ దేవత వస్తుందని ఆమెకు ఎంత ఘనంగా స్వాగతం పలికితే అంత అదృష్టం పడుతుందని నమ్ముతున్న గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు ఇలలో వెల కట్టలేనివి.
ముగ్గులలో చిలుకలు అమ్మవారి ప్రతిరూపాలు రథం ముగ్గులు పట్నాలు వేసి అమిత ఆనందం పొందటం వారికే చెల్లింది గిరిజనుల కట్టుబాట్లు నేటికీ నిలిచాయంటే వనదేవతల కరుణ కటాక్షాలు అలాంటివి. ఏదో ఒక మహా శక్తి తన వెంట ఉందని నమ్మే ఈ గిరిజన ప్రజల కోరిన కోరికలన్నీ నెరవేరాలని మనం కూడా కోరుకోవడంలో ఏమాత్రం సందేహం లేదేమో…..

Share This Post