ఎందరో మహానుభావుల త్యాగఫలమే నేడు మనం అనుభవిన్తున్న స్వాతంత్రం : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్చ- స్వాతంత్రo అనుభవిన్తున్నామని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌ ఇండియా – 75 వేడుకలలో భాగంగా శనివారం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐ.బి. చౌరస్తాలో గల రోడ్డు-భవనాల శాఖ అతిథి గృహం నుండి జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల మైదానం వరకు ఫిట్‌ ఇండియా ఫ్రీడమ్‌ రన్‌ 2.0 కార్యక్రమం నిర్వహించి మైదానంలో అందరిచే ఫిట్‌ ఇండియా ఫ్రీడమ్‌ రన్‌ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సoదర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎంతో మంది త్యాగధనులు, పోరాటవీరులు, మహానుభావుల ప్రాణత్యాగాలు, పోరాటాల ఫలితంగానే నేడు మనం స్వేచ్చ- స్వాతంత్రo అనుభవిన్తున్నామని, దేశంలో అమలవుతున్న ప్రజాస్వామ్య వ్యవన్ధ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని అన్నారు. కొవిడ్‌-19 విపత్కర పరిస్థితులను, సమాజంలో నెలకొన్న సమన్యలను మనమంతా సమిష్టిగా ఎదుర్కోవాలని తెలిపారు. ఆగన్ఫు 15, 2020 నుండి అక్టోబర్‌ 2, 2020 వరకు మొదటి ఎడిషన్‌ నిర్వహించడం జరిగిందని, ఇందులో కేంద్ర సాయుధ దళాలు, ఎన్‌.జీ.ఓ.లు, ప్రైవేట్‌ సoన్ధలు, పాఠశాలలు, యూత్‌ క్లబ్‌లు, కేంద్ర / రాష్ట్ర విభాగాలు, సoన్ధలు, 5 కోట్ల మందికి పైగా ప్రజలు కోటి కిలోమీటర్ల దూరం పాల్గొన్నారని, ఫిట్‌ ఇండియా ఫ్రీడమ్‌ రన్‌ 2.0 కార్యక్రమం అక్టోబర్‌ 2, 2021 వరకు కొనసాగుతుందని, ప్రజలు తమ రోజు వారీ జీవితంలో కనీనం ౩0 నిమిషాల పాటు శారీరక (శ్రమ, పరుగు, క్రీడలు వంటి ఫిట్‌నెన్‌ కార్యక్రమాలను చేర్చుకొని ఆరోగ్యంగా ఉంటూ అనేక వ్యాధులకు దూరంగా జీవించవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎ.ని.పి. అఖిల్‌ మహాజన్‌, జిల్లా క్రీడా, యువజన శాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా లీడ్‌ బ్యాంక్‌
మేనేజర్‌ హవేలిరాజు, నంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post