ఎందరో మహానుభావుల త్యాగఫలంతోనే స్వాతంత్ర్య ఫలాలు ఫ్రీడమ్రన్లో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్

పత్రిక ప్రకటన

తేదీ : 11–08–2022

ఎందరో మహానుభావుల త్యాగఫలంతోనే స్వాతంత్ర్య ఫలాలు
ఫ్రీడమ్రన్లో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్
ఉత్సాహంగా పాల్గొన్న అధికారులు, యువకులు, ప్రజలు
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో ఫ్రీడమ్రన్ ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గురువారం ఉదయం జిల్లా కేంద్రంలోని కీసర ఆర్డీవో కార్యాలయం నుంచి కీసర చౌరస్తా వరకు ఫ్రీడమ్రన్ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కీసర చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలర్పించారని ప్రస్తతం మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్య ఫలాలు వారి ప్రాణాలను ఫణంగా పెట్టి సముపార్జించారని అన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో సమరయోధులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని భవిష్యత్తు తరాలకు తెలియజేయాలన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు విస్మయం చెందేలా వేడుకలను నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు స్వతంత్ర వజ్రోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించేలా కార్యక్రమాలను రూపొందించారని అన్నారు. మేరకు ఈనెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పదిహేను రోజుల పాటు రోజుకో కార్యక్రమం చొప్పున నిర్వహించడం జరుగుతుందని ఈ మేరకు పాఠశాల విద్యార్థులు థియేటర్లలో ప్రదర్శించబడతుతున్న గాంధీ చిత్రాన్ని తప్పకుండా వీక్షించాలన్నారు. అలాగే శనివారం నిర్వహించనున్న ఫ్రీడమ్ ర్యాలీలో యువకులు, పట్టణ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ శ్యాంసన్ కోరారు. ప్రతి ఒక్కరు జాతీయ జెండాను గౌరవించేలా ఉండాలని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదపు కలెక్టర్ లింగ్యానాయక్, కుషాయిగూడ రశ్మిత పెరమాలు ఐపిఎస్, జడ్పీసీఈవో దేవ సహాయం,కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, ఆర్డిఓ రవి, ఎంపీపీ, ఎంపీటీలు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు

 

Share This Post