ఎంపీడీవోలు వెంటనే గ్రామ సభల నివేదికలు పంపించాలి- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు

@ నేటినుండే పోడు భూముల గ్రామసభలు @ గ్రామసభలలో శాసనసభ్యులు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలి
@ ఎంపీడీవోలు వెంటనే గ్రామ సభల నివేదికలు పంపించాలి- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ఆదేశం
పోడుభూముల పరిశీలన సర్వేకు సంబంధించి గ్రామసభల నిర్వహణ విషయమై మంగళవారం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్ నుండి తాహసిల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 16 నుండి పోడు భూముల గ్రామసభలను నిర్వహించాలని ఆదేశించారు. గ్రామసభల షెడ్యూల్ ను ముందుగానే స్థానిక శాసనసభ్యులు, ఎంపీపీ ,జడ్పిటిసి లకు పంపించాలని, ఈ గ్రామ సభలలో శాసనసభ్యులతో పాటు, స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వాములయ్యేలా చూడాలన్నారు. అవసరమైన మండలాలలో ఎంపీడీవో తాహసిల్దార్, డీటీ నాలుగు టీములను ఏర్పాటు చేయాలని, అవసరమైన మేరకు బృందాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. పోడు భూముల గ్రామసభల నిర్వహణ విషయమై ఎంపీవో, ఎంపీడీవో ఎలా చేయాలో ముందే నివేదికలు తయారు చేసుకోవాలని, ఈ విషయమై వెంటనే తాహసిల్దార్లు సమావేశం నిర్వహించాలని చెప్పారు .గ్రామాలలో గ్రామాల సభలు జరిగే విషయాన్ని పోడు భూముల కమిటీతో పాటు, గ్రామస్తులకు తెలియజేయాలని అన్నారు. కమిటీ సభ్యులందరూ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామసభల అనంతరం సబ్ డివిజన్ స్థాయిలో ఆర్డీవో ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయా మండలాల వారిగా సమీక్షించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ధరణి పెండింగ్ దరఖాస్తులపై తాహసిల్దారులతో సమీక్షిస్తూ ధరణిలో పెండింగ్లో ఉన్న 918 వివిధ రకాల దరఖాస్తులను త్వరిత గతిన పరిష్కరించాలని, ముఖ్యంగా కోర్టు కేసులు, టీఎం -33, జిఎల్ఎం దరఖాస్తులు వీటన్నింటిపై దృష్టి కేంద్రీకరించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఎక్కువగా దరఖాస్తులు పెండింగ్ ఉన్న మండలాల తాహసిల్దారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిందిగా ఆదేశించారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, ఆర్డిఓ అనిల్ కుమార్, తాహసిల్దార్లు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.

Share This Post