పత్రికా ప్రకటన 2,. తేది:22.10.2021, వనపర్తి.
సైన్స్ తోనే నూతన సమాజం ఏర్పడుతుందని, పాఠశాల విద్యార్థులకు వారి మేధస్సు పెంపొందించుటకు, వినూత్న ప్రయోగాలు చేయుటకు ఉపాధ్యాయులు అన్ని విధాలుగా సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సూచించారు.
శుక్రవారం వనపర్తి పట్టణంలోని ఎం.వై.ఎస్. ఫంక్షన్ హాల్ లో ఐ ఎల్ పి (ఇండియా లిటరసీ ప్రాజెక్ట్) సంస్థ ఆధ్వర్యంలో ఆర్ డి ఎస్ ద్వారా వనపర్తి సైన్స్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 55 ప్రభుత్వ పాఠశాలలకు సైన్స్ కిట్లను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల చొరవతో విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలని, సరికొత్త ప్రయోగ ప్రదర్శనలు నిర్వహించాలని, తద్వారా విద్యార్థుల పురోభివృద్ధికి మార్గదర్శకాలు కావాలని జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులకు విద్యతో పాటు సైన్స్, సామాజిక కార్యక్రమాలపై శిక్షణ ఇస్తే మెరుగైన విద్యార్థులుగా తయారవుతారని జిల్లా కలెక్టర్ తెలిపారు.
అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోకనాథ్ రెడ్డి మాట్లాడుతూ ILP, Verizon సంస్థల ద్వారా సైన్స్ ప్రయోగాలకు కావలసిన పరికరాలను (సైన్స్ కిట్) అందించినందుకు RDS సంస్థ నిర్వాహకులను జడ్పీ చైర్మన్ అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జడ్పీ చైర్మన్ చేతుల మీదుగా సైన్స్ కిట్లను అందజేశారు. విద్యా రంగంలో సైన్స్ పట్ల అవగాహన పెంచేందుకు, వారి నైపుణ్యాలను వెలికితీసేందుకు ఈ సైన్స్ కిట్స్ ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. ఈ సైన్స్ కిట్ల సహాయంతో విద్యార్థులు ప్రయోగ ప్రదర్శనలు చేసి, తమ ప్రాజెక్టు ద్వారా వివరించారు.
రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సంస్థ నిర్వాహకురాలు చిన్నమ్మ తామస్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో, 111 అంగన్వాడీ కేంద్రాలలో ఐ ఎల్ పి ప్రాజెక్టుతో కలిసి పని చేస్తున్నట్లు ఆమె తెలిపారు. వనపర్తి, కొత్తకోట ప్రభుత్వ పాఠశాలలో వారు సహకారం అందిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఈవో రవీందర్, డి.ఎస్.ఒ. శ్రీనివాసులు, , రవి మణి, హరిత దళం జిల్లా అధికారి సుదర్శన్ రావు, భాను సమీర్. కరుణాకర్. ఐ ఎల్ పి. ఆర్ డి ఐ సంస్థల నిర్వాహకులు. జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయడమైనది.